World War 3: పలు దేశాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో యుద్ధ మేఘాలు బలంగా కమ్ముకున్నాయి. ఇప్పటికే /ఉక‌్రెయిన్ – రష్యా, ఇజ్రాయెల్- ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్నది. రెండు వైపులా ప్రాణ, ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. అయినా ఆయా దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఏ క్షణాన ఏ బాంబు వచ్చి తమపై పడుతుందోనని ఆయా దేశాల్లో సామాన్యులు భిక్కు భిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల కష్టాలు మాములుగా లేవు. పిల్లలు, పెద్దలు, మహిళలు ఇలా మరణాల రేటు విపరీతంగా ఉంది. యుద్ధోన్మాదం కారణంగా ఆయా దేశాల్లో ఆహార నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఇక అగ్రదేశాలు కూడా ఇరువర్గాల పక్షాన నిలబడ్డాయి. రష్యా*- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికే ఏడాది దాటింది. చిన్న దేశమైన ఉక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా అమెరికా అందించిన మిస్సైళ్లను రష్యా పై ప్రయోగించింది. దీంతో రష్యాకు కలుక్కుమంది. వెంటనే తమ అణు విధానాన్ని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో అప్రమత్తమైన అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా గనుక రంగంలోకి దిగితే ఇక నాటో దేశాల దళాలు కూడా ఈ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది. రష్యాకు గట్టి బుద్ధి చెప్పాలని అమెరికా కూడా భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇక హమాస్, ఇరాన్, ఇజ్రాయెల్ ల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా లేవు. ఇజ్రాయెల్ వరుస దాడులతో ఇరాన్ లో విధ్వంసం కొనసాగుతున్నది. ఇప్పటికే హమాస్ నేతలను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ ఇక ఇరాన్ కు గట్టి బుద్ధి చెప్పాలని భావిస్తున్నది. ఇజ్రాయెల్ దళాల దూకుడుకు ఇరాన్ అడ్డుకట్ట వేయలేకపోతున్నదనే వార్తలు బయటకు వస్తున్నాయి. ఏ క్షణమైన ఈ యుద్ధం మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది.
మరోవైపు ప్రపంచంలోని పలు దేశాల్లో పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే శత్రువు చుట్టు పక్కలా పాగా వేసేందుకు ప్రణాళిక లు వేస్తున్నాడు. ఇప్పటికే పలు మార్లు కవ్వింపు చర్యలకు దిగాడు. అటు పాకిస్థాన్‌తో కలిసి కుట్రలు చేస్తున్నట్టు సమాచారమందుతున్నది. అటు తైవాన్ పై దురాక్రమణకు సిద్ధమవుతున్నట్లుగా నే చైనా దళాలు పలు చర్యలు చేపట్టారు. మిలటరీ ఆపరేషన్లు, వైమానిక కవాతులు ఇటీవల నిర్వహించారు. భారత్ చుట్టూ ఉన్న సముద్ర జలాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలపై తమ అధిపత్యం కొనసాగాలని చైనా పాలకులు భావిస్తున్నారు.
అందుకే సరిహద్దు వెంట కొన్ని కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భారత్. కు ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఎటు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.