Homeలైఫ్ స్టైల్Phoe Pay, Google Pay: చెక్.. ఈ యాప్ తో జీరో చార్జీ.. అదేంటో తెలుసా?

Phoe Pay, Google Pay: చెక్.. ఈ యాప్ తో జీరో చార్జీ.. అదేంటో తెలుసా?

Phoe Pay, Google Pay: నేటి కాలంలో Money Transfer చేయడానికి స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. గ్రామీణుల నుంచి నగరాల వరకు ప్రతి ఒక్కరూ మొబైల్లోని UPI చెల్లింపులకు అలవాటు పడ్డారు. ఈ రకమైన డిజిటల్ పేమెంట్స్ ను ఫోన్ పే, గూగుల్ పేలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. మొదట్లో గూగుల్ పే యాప్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే రివార్డ్ లు ఇచ్చేది. ఆ తరువాత కొన్ని పేమేంట్స్ పై ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా బజాజ్ పిన్ సర్వ్ మనీ పేమేంట్స్ అందుబాటులోకి వచ్చింది. ఇది BHIM UPIని ఏకీకృతం చేస్తూ బజాజ్ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది జీరో సర్వీస్ ఛార్జీ కింద పనిచేస్తుందని ప్రకటించడంలో వినియోగదారులు దీనికి ఆకర్షితులవుతున్నారు. మరి దీని ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

Bajaj Pinserve ఫైనాన్ష్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే తాజాగా డిజిటల్ పేమేంట్స్ Bajaja Pinserve Upi Light యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకపోవడం. మొబైల్ రీచార్జ్, విద్యుత్ బిల్లులు వంటివి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించవచ్చు. అలాగే కొన్ని కిరాణా సామాను కొనుగోలుకు సైతం అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. కొన్ని భారీ పేమేంట్స్ కూడా అదనపు ఛార్జీలు లేకుండా చేయొచ్చు.

ఈ యాప్ ఫీచర్ల విషయానికొస్తే.. మిగతా వాటికంటే సులభరతంగానూ.. వేగంగానే ఇది పని చేస్తుంది. ఇంటర్నెట్ కవరేజీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ యాప్ ప్రాసెస్ లో ఎటువంటి మార్పులు ఉండవుు. అలాగే దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా ఈ యాప్ ద్వారా పేమేంట్స్ చేయొచ్చు. వినియోగదారులకు బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ Upi ఐడీని షేర్ చేసుకొని పేమేంట్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు ఈ యాప్ లో తమకు నచ్చిన ఖాతాను లింక్ చేసుకోవచ్చు. ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఇందులో యాడ్ చేసుకొన ఏదీ అవసరం ఉంటే దాని ద్వారా చెల్లించొచ్చు .

Bajaja Pinserve Upi Light ద్వారా చెల్లింపులు సురక్షితంగా ఉంటాయని యాప్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలంలో సైబర్ మోసాలు ఎక్కువగా సాగుతున్న నేపథ్యంలో ఎన్ క్రిప్షన్ తో కూడిన లావాదేవీలు ఉంటాయని తెలిపారు. దీనిని సామాన్యులు సైతం వినియోగించేలా సులభతరమైన డిజైన్ తో కూడి ఉంది. ముఖ్యంగా సీనియర్ సీటిజన్లకు ఇది అనుకూలంగా ఉంటుది. ప్రస్తుత కాలంలో సీనియర్ సిటిజన్లు యూపీఐ ని తక్కువగా వినియోగిస్తున్నారు. ఇలాంటి సమయంలో వీరి కోసం Bajaja Pinserve Upi Light అనుగుణంగా ఉండనుందని అంటున్నారు.

దేశ వ్యాప్తంగా రోజరోజుకు యూపీఐ యూజర్స్ పెరిగిపోతున్నారు. అయితే ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్ లో అదనపు ఛార్జీలు విధిస్తుండడంతో చాలా మంది వీటి నుంచి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా రెగ్యులర్ గా పేమేంట్స్ చేసేవారికి ఈ యాప్ చాలా ప్లస్ పాయింట్ గా మారనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version