https://oktelugu.com/

Tollywood Herohine: ఇదేం బాడీ అన్నవాళ్లు ఇప్పుడు ఆ హీరోయిన్ వెంటపడుతున్నారట.. ఎవరంటే?

తెలుగు ఇండస్ట్రీ అంటే ఎవరికైనా ఇష్టమే. అందుకే మిగతా పరిశ్రమల్లోని నటులు తెలుగులో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. లేటేస్టుగా దివ్య భారతీ అనే హీరోయిన్ తెలుగులో అడుగుపెట్టబోతుంది. వాస్తవానికి దివ్యభారతి తెలుగు లో కనిపించడం కొత్తేమీ కాదు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2024 / 03:23 PM IST

    Herohine divyabharathi

    Follow us on

    Tollywood Herohine: సినిమాల్లో అవకాశాలు రావడమే అరుదు. ఈ నేపథ్యంలో కొందరు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ సద్వినియోగం చేసుకుంటారు. అలా ఓ బ్యూటీ తనకు ఓ సినిమాలో అవకాశం రావడంతో తన నటనతో ఆకట్టుకుంది. దీంతో పలు సినిమాల్లో నటించింది. కోలీవుడ్ కు చెందిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో అడుగుపెట్టబోతుంది. అయితే ఒకప్పుడు ఈమె అందం గురించి హేళనగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఆమెను చూసి నోరెళ్లబెట్టుకుంటున్నారు. ఆమె అందానికి ఫిదా అయి ప్యాన్స్ గా మారిపోతున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ? తెలుగులో ఆమె నటిస్తున్న మూవీ ఏంటి?

    divyabharathi-1

    తెలుగు ఇండస్ట్రీ అంటే ఎవరికైనా ఇష్టమే. అందుకే మిగతా పరిశ్రమల్లోని నటులు తెలుగులో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. లేటేస్టుగా దివ్య భారతీ అనే హీరోయిన్ తెలుగులో అడుగుపెట్టబోతుంది. వాస్తవానికి దివ్యభారతి తెలుగు లో కనిపించడం కొత్తేమీ కాదు. కానీ నేరుగా హీరోయిన్ గా నటిస్తున్న తెలుగు సినిమా ‘గోట్’. ఇందులో కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరో. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దివ్య భారతి గురించి ఓ ఆసక్తి విషయం వెలుగులోకి వచ్చింది.

    దివ్య భారతి 2015 లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే అంతకంటే ముందే ఆమె కళాశాలలో ఉన్నప్పుడు ఈమె అందం గురించి కొందరు హేళన చేశారట. తనపై జోకులు కూడా వేశారట. దీంతో ఆమె కాస్త నిరాశ చెందాననిన ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. తమిళ ఇండస్ట్రీలో ‘బ్యాచిలర్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మదిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, మహారాజ వంటి సినిమాల్లో కనిపించింది. ఇందులో ‘మహారాజ’ సినిమా తెలుగు డబ్ అయింది.

    ప్రస్తుతం దివ్య భారతి ఫొటోలను చూసి అప్పుడు హేళన చేసిన వారు షాక్ అవుతున్నారట. తన అందంతో కట్టిపడేస్తున్న దివ్యభారతి ఫొటోలను చూసి లైక్ లు కొడుతున్నారు. కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన దివ్య భారతి తెలుగులో ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో తెలియాల్సి ఉంది.