Allu Arjun: ప్రస్తుతం పాన్ ఇండియాలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్…మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చాడా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి.
అలాగే తెలంగాణలో పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు జరగనున్నాయి. ఇక వీటిని బేస్ చేసుకుని ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా పొలిటికల్ హీట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ కి చెందిన కె ఆర్ కె అనే ఒక ఫేమస్ క్రిటిక్ అల్లుఅర్జున్ కు సంబంధించిన ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది ఏ వీడియో అంటే అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ కి ప్రచారం చేస్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఇది చూసిన చాలామంది ఇది నిజం అనుకొని అల్లు అర్జున్ మీద కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తను సపోర్ట్ చేయడం ఏంటి జనసేన పార్టీ ఉంది కదా అంటూ విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇది ఒక ఫేక్ వీడియో అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక 2022 లో “అమెరికాలో జరిగిన ఇండియన్ డే పరేడ్ వార్షికోత్సవం” సందర్భంగా అల్లు అర్జున్ ఆ కార్యక్రమం లో పాల్గొన్న వీడియో గా బూమ్ సంస్థ నిర్ధారించింది… ఇక ఈ వీడియోని రివర్స్ సెర్చ్ ద్వారా గమనిస్తే అల్లు అర్జున్ పరేడ్ లో పాల్గొన్నట్టుగా అలాగే వీడియోలు కూడా బయటపడ్డాయి.
జాతీయ మీడియా సంస్థలు అన్ని ఈ న్యూస్ ను కవర్ చేశాయి. ఇక 2022 ఆగస్టు 23వ తేదీన ఈ వీడియోని అప్లోడ్ చేసినట్టుగా ఉంది. ఇక డిస్క్రిప్షన్ లో న్యూయార్క్ లో జరిగిన “40 వ ఇండియా డే పరెడ్ వార్షికోత్సవం లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ ” అని ఉంది. అది గమనిస్తే ఇప్పుడు నడుస్తున్న వీడియో ఫేక్ అని తెలుస్తుంది…కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలను ఎంకరేజ్ చేయకుండా ఉంటే మంచిది…