https://oktelugu.com/

Drink Water: నీళ్లు ఇలా తాగితే అనారోగ్యాల పాలు కావడం ఖాయం

చాలా మంది ఉదయం లేవగానే నీరు తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లగొట్టాలంటే నీటితోనే సాధ్యమవుతుంది. అయితే బరిగడుపున ఒక గ్లాసు నీరు మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ నీరు తీసుకోవద్దు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 23, 2024 / 03:26 PM IST

    drinking-water

    Follow us on

    Drink Water:  మానవ శరీరం 65 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది తక్కువైనప్పుడల్లా దాహం వేస్తుంది. ఈ సమయంలో కొందరు నీరు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. దీంతో డీ హైడ్రేషన్ గురై.. ఆ తరువాత అనేక అనారోగ్యాలకు గురవుతారు. అయితే కొందరికి దాహం వేయకుడాన్న డీ హైడ్రేషన్ కు గురవుతారు. అందువల్ల దాహం వేసినా వేయకున్నా క్రమపద్ధతిలో నీరు తీసుకోవాలి. అప్పుడే శరీరం సమతుల్యస్థితిలో ఉండి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే శరీరానికి నీరు ఎంత అవసరం అయినా..ఈ రకంగా తీసుకుంటే వాంతులు అవుతాయి. ఎప్పుడంటే?

    వేసవిలో వీపరీతమైన దాహం వేస్తుంది. నీరు ఎంత తాగినా చెమట ద్వారా బయటకు వెళ్తుంది. ఈ తరుణంలో బయటకు వెళ్లాల్సి వస్తే చేతిలో ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెళ్లడం మంచిది. ఇంట్లో ఉన్నా సమయం ప్రకారం నీరు తీసుకోవాలి. లేకుంటే ఉష్ణోగ్రత ఎక్కువై శరీరం నుంచి నీరు బయటకు వెళ్తుంది. అయితే నీరు ఇష్టమొచ్చినట్లు తాగినా ప్రమాదమే. క్రమ పద్ధతిలో నీరు తీసుకోకుంటే ఇది అనారోగ్యానికి గురి తెస్తుంది.

    చాలా మంది ఉదయం లేవగానే నీరు తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని మలినాలు బయటకు వెళ్లగొట్టాలంటే నీటితోనే సాధ్యమవుతుంది. అయితే బరిగడుపున ఒక గ్లాసు నీరు మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ నీరు తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల వాంతులు అవుతాయి. అలాగే భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీరు తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి. భోజనానికి అరగంట ముందు.. భోజనం అయిన తరువాత అరగంటలకు వాటర్ తీసుకోవడం ఉత్తమం.

    వేసవిలో ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వారు వెంటనే నీరు తాగుతారు. అలా తాగినా ప్రమాదమే. ఇలా ఒక్కసారి వేడిలో ఉండి నీరు తాగడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక ఫ్రిజ్ లో ఉన్న నీరు బయటకు తీసిన వెంటనే నీరుతాగొద్దు. ఫ్రిజ్ వాటర్ అవసరం కంటే ఎక్కువ కూల్ గా ఉంటాయి. దీంతో అధిక దాహం వేసినప్పుడు ఫ్రిజ్ నీరు ఎక్కువగా తాగలేరు. దీంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. సాధ్యమైనంత వరకు నార్మల్ కూల్ వాటర్ తీసుకుంటూ ఉండాలి.