Actress Meena: నిన్నటి తరం హీరోయిన్స్ లో ఇప్పటికీ చెక్కు చెదరని అందం తో కొనసాగుతున్న వారిలో ఒకరు మీనా(Actress Meena). బాలనటిగా వెండితెర అరంగేట్రం చేసి , ఆ తర్వాత హీరోయిన్ గా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ తో ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్స్ ని అందుకొని, ఫ్యామిలీ మరియు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్,బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోని అగ్ర హీరోలతో సినిమాలు చేసి పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ ఈమె సినిమాలు చేస్తూనే ఉంది. పలు టీవీ షోస్ కి జడ్జీ గా కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంది. అయితే ఈమె భర్త విద్యాసాగర్ 2022 వ సంవత్సరం లో కరోనా కారణంగా చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
అప్పటి నుండి మీనా పై సోషల్ మీడియా లో ఎన్నో ప్రచారాలు జరిగాయి. ఈమె ప్రముఖ తమిళ హీరో ధనుష్ తో డేటింగ్ లో ఉందని, త్వరలోనే ఆయన్ని రెండవ పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపించాయి. దీనిపై స్పందించిన మీనా, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్ ఏమిటంటే, కొత్త సంవత్సరం లో మీనా రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, మరియు ఆమె కూతురు కూడా అందుకు ఒప్పుకుందట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మీనా తన సోషల్ మీడియా ద్వారా తెలిపే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కొడుకు సినీ ఇండస్ట్రీ కి చెందిన వాడా?, లేదంటే బయట వాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఈ రూమర్ అబద్దం అయితే కచ్చితంగా మీనా తన సోషల్ మీడియా ద్వారా స్పందించేది, కానీ ఎలాంటి రియాక్షన్ రాలేదంటే, ఈ వార్త నిజమేనేమో అని అనుకుంటున్నారు నెటిజెన్స్. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా మీనా ఈ విషయం లో క్లారిటీ ఇస్తుందో లేదో అనేది.