Trivikram Srinivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ స్టామినా పెంచిన ఏకైక రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్…కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ సక్సెస్ లను సాధించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారాడు…తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలలో ఒకరి రెండు మినహాయిస్తే మిగిలిన సినిమాలన్నీ భారీ విజయాలను నమోదు చేశాయి..80% సక్సెస్ రేటుతో ముందుకు సాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. వీలైనంత తొందరగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… త్రివిక్రమ్ తన తర్వాత సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తానని ప్రకటించాడు. పౌరాణికపు అంశాలను జోడించి ఫిక్షన్ కథతో తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని తొందర్లోనే ఇస్తానని చెప్పిన త్రివిక్రమ్ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక వెంకటేష్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఇవ్వబోతున్నట్టుగా ప్రొడ్యూసర్ నాగ వంశీ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో మరొక సినిమా చేయడానికి ప్రణాళికలైతే రూపొందించుకుంటున్నాడట. ఇక ఇలాంటి క్రమంలో ఇంతకుముందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాకి కమిట్ అయ్యాడు.
మరి వీళ్లిద్దరిలో ఆయన ఎవరితో మొదట సినిమా స్టార్ట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. నిజానికి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథనే జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గురూజీతో సినిమా చేయాలని చూస్తున్నాడు. కాబట్టి అతని సినిమాని ముందు తెరకెక్కించే అవకాశాలైతే ఉన్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఆయన మార్కెట్ భారీగా పెరుగుతోంది. లేకపోతే మాత్రం మరోసారి ఆయన డీలా పడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఇండస్ట్రీ కి వచ్చి 25 ఇయర్స్ అవుతునప్పటికి ఇప్పటివరకు ఒక ఇండస్ట్రీ హిట్టు కూడా లేదు.
అయిన కూడా ఎలాగోలాగా కెరియర్ ను నెట్టుకొస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు కనక ఇండస్ట్రీ హిట్ ను సాధించకపోతే మాత్రం టైర్ వన్ హీరోలందరిలో తను చివరి స్థానానికి పడిపోయే ప్రమాదమైతే ఉంది. ప్రశాంత్ నీల్ సినిమా తేడా కొడితే త్రివిక్రమ్ సైతం అల్లు అర్జున్ తోనే సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి. చూడాలి మరి త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడు అనేది…