Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సక్సెస్ లను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్క సినిమాని మిస్ చేసుకుంటే ఏం అవుతోంది అనే డౌట్ మనలో చాలా మందికి రావచ్చు. కానీ ఒక్క సినిమా వల్లే ఓవర్ నైట్ లో చాలా మంది స్టార్లుగా మారారు… ఒక మంచి సినిమాను వదిలేసుకోవడం వల్ల కెరియర్ ను పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం తన కెరీర్ లో ఎన్నో సినిమాలను మిస్ చేసుకున్నాడు. కొన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే మరి కొన్ని సినిమాలతో డీలా పడిపోయాడు. అతను ఒక సినిమా ను చేయాలని చాలా ఆసక్తి చూపించినప్పటికి అది వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఆ సినిమాను మరొక హీరో చేసి ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాత వాసి… ఈ సినిమాని త్రివిక్రమ్ మొదట మహేష్ బాబు తో చేయాలనుకున్నాడట.
మహేష్ కూడా ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఇక అంతలోనే త్రివిక్రమ్ దగ్గర ఉన్న కథను పవన్ కళ్యాణ్ విని ఇది మనం చేద్దామని చెప్పాడట. పవన్ కళ్యాణ్ అడగడంతో త్రివిక్రమ్ కాదనలేక పోయాడట. ఫైనల్ గా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేశారు.
ఈ మూవీ భారీ హైప్ తో రిలీజ్ అయినప్పటికి డిజాస్టర్ గా మారింది. కథలో అంత పెద్దగా వైవిధ్యం లేకపోవడం, వాళ్ళు చెప్పాలనుకున్న కథని క్లారిటీగా చెప్పలేకపోవడం వల్ల ఈ సినిమా భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. మొత్తానికైతే ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ భారీగా తన మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది…
ఇక ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు మాత్రం మా అన్న సేఫ్ అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసి ఫ్లాప్ ను కట్టబెట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేస్తుంటే త్రివిక్రమ్ మాత్రం వెంకటేష్ తో ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు…