https://oktelugu.com/

Shots : సినిమా మేకింగ్ లో లాంగ్, క్లోజ్ షాట్స్ గురించి తెలుసు.. మరి ‘చీటింగ్ షాట్స్’ అంటే ఏంటి.?వీటి వల్ల ప్రయోజనం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నిజానికి ఒక సినిమా తీయడానికి దర్శకుడికి చాలా అనుభవం అయితే ఉండాలి. ఆ సినిమాని ఎలా తీయాలి, ఎలా చేస్తే ప్రేక్షకుడికి నచ్చుతుంది. అనే ధోరణిలోనే ఆయన ఆలోచిస్తూ ఉంటాడు...

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 11:07 AM IST

    Shots

    Follow us on

    Shots : సినిమా మేకింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అని మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లో అందుకొని స్టార్ డైరెక్టర్లుగా వెల్గొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఇక దానికి తగ్గట్టుగా కష్టపడితే ఇక్కడ ప్రతి ఒక్కరికి సూపర్ సక్సెస్ లైతే లభిస్తాయి. కానీ అలా కాకుండా కష్టం లేకుండా ఇక సక్సెస్ అవ్వదం అనేది అస్సలు జరగదు. మరి ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు మేకింగ్ మీద చాలా ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మేకింగ్ లో లాంగ్ షాట్, క్లోజ్ షాట్ అనేవి మనకు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇక వాటితో పాటుగా ‘చీటింగ్ షాట్స్’ అనేవి కూడా ఉంటాయి. ఇంతకీ చీటింగ్ షాట్స్ అంటే ఏంటి వాటి వల్ల సినిమాకి యూజ్ ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    ఒక సినిమాలో చాలా మంది నటులు నటిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో టైమ్ కి వచ్చి వాళ్లు ఏదైతే చేయాలో అది చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల పెద్ద ఆర్టిస్టుల డేట్స్ ఒక్కో రోజు అడ్జస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.అలాంటప్పుడు ఆ ఆర్టిస్టులు ఉన్న లేకపోయినా కూడా వాటిని మేనేజ్ చేస్తూ అతను ఉన్నట్టుగా ఒక ఇల్యుయజన్ క్రియేట్ చేస్తూ సినిమాని చేయాల్సి ఉంటుంది. దాన్ని చీటింగ్ షాట్స్ అంటారు. ఉదాహరణకి ఒక ఫేమస్ ఆర్టిస్ట్ లేకపోతే ఆయన సజెషన్ లో అవతలి వాళ్ళ మీద కెమెరా పెట్టి వాళ్ల డైలాగ్స్ ను తీసుకోవడాన్ని చీటింగ్ షాట్స్ అంటారు.

    అలాగే ఎదురుగా ఎవరూ ఉన్న లేకపోయినా ఒక ఆర్టిస్ట్ మీద క్లోజ్ పెట్టి అతని రియాక్షన్స్ అతని డైలాగ్స్ తీసుకోవడం కూడా చీటింగ్ షాట్స్ కిందికే వస్తుంది. ఇలాంటివి చేయడం వల్ల దర్శకుడికి సినిమా మేకింగ్ మీద ఎక్కువ సమయం అనేది పట్టదు.

    అందుకే తక్కువ రోజుల్లో సినిమా చేయడానికి ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఆర్టిస్టుల డేట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన పని ఉండదు. దీనివల్ల మేకింగ్ పరంగా అయిన అటు నిర్మాతకి బడ్జెట్ పరంగా అయిన కూడా చాలా ఈజీ గా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో మేకర్స్ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు.

    కానీ ఇలాంటివి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా కొట్టినా కూడా ఈజీగా చీటింగ్ షాట్స్ అనేవి తెలిసిపోతూ ఉంటాయి. దాని వల్ల సినిమా మీద నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది…