Yuzvendra Chahal : భారత క్రికెటర్ల లవ్‌స్టోరీ ఒక్కొక్కరిదీ ఒక్కో రకంగా ఉంటుంది. తాజాగా భారత యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు భార్య ధనశ్రీవర్మ ఉంది. మోడల్ అయిన ధనశ్రీవర్మ సోషల్ మీడియా(Social Media) లో యాక్టిిటీవ్ గా ఉంటుంది. అమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. గ్లామర్ ఫోటోలతో తన అభిమానులకు కనువిందు చేస్తుంది. అయితే ఇటీవలే చాహల్, ధనశ్రీ విడాకులు తీసకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అందునా ఈ జంట మూడు నెలలుగా విడివిడిగా జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామాల నడుమ చాహల్ మరో అమ్మాయికి గూగ్లీ వేసి బౌల్డ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముంబైలోని ఓ హోటల్‌లో మరో యువతితో మీడియా కంట పడ్డాడు.
ముంబై హోటల్‌లో..
చాహల్ ఇటీవల ముంబై(Mumbai)లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో గుర్తు తెలియని మిస్టరీ గార్ల్‌తో కనిపించాడు. తెల్లటి ఓవర్ సైజ్ టీషర్టు, బ్యాగీ జీన్స్ ధరించిన భారత క్రికెటర్ కెమెరా కంట పడకుండా అపసోపాలు పడ్డాడు. హోట్ స్తంభాల చాటున దాక్కోవడం, చేతితో ముఖం కనిపించకుండా చేయడం వంటివి చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కెమెరాకు చిక్కాడు. మిస్టరీ గార్ల్‌తో చాహల్ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో అతినితో ఉన్న యువతి తమ బంధాన్ని బయట పెట్టండి అన్నట్లుగా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది.
చిన్ననాటి స్నేహితురాలు..!
ఇదిలా ఉంటే.. చాహల్‌తో హోటల్‌లో ఉన్న అమ్మాయి వివరాలు తెలయలేదు. అయితే వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులని ప్రచారం జరుగుతోంది. ధనశ్రీతో ప్రేమాయణానికి ముదం ఆమె భారత క్రికెటర్‌కు ప్రపోజ్ చేసినట్లు ఓ స్పోర్ట్స్ ఛానెల్ తన కథనంలో పేర్కొంది. బహుశా ప్రస్తుతం ధనశ్రీ దూరమైందని చాహల్‌ను ఓదార్చడానికి దగ్గరయిందన్న వార్తలు వినబడుతునాన్యి. నాలుగురోజులు ఆగితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.