Homeఎంటర్టైన్మెంట్Madame Tussaud Museum : పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కి తప్ప..మిగిలిన స్టార్ హీరోలందరికీ దక్కిన...

Madame Tussaud Museum : పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కి తప్ప..మిగిలిన స్టార్ హీరోలందరికీ దక్కిన అరుదైన గౌరవం..నిరాశలో ఫ్యాన్స్!

Madame Tussaud Museum :  టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ 2 హీరోల లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్లిద్దరికీ ఉన్నటువంటి క్రేజ్, ఫాలోయింగ్ ఎవరికీ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళిద్దరికి దక్కని అరుదైన గౌరవం, మిగిలిన స్టార్ హీరోలందరికీ దక్కింది. ఇదే ఇప్పుడు ఇరువురి హీరోల అభిమానులకు నిరాశగా మిగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సింగపూర్ లో ఉండే మేడమ్ తుస్సాద్స్ మ్యూజియం లో మన టాలీవుడ్ హీరోలకు సంబంధించిన మైనపు బొమ్మలు ప్రతిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అందరికంటే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పట్లో ఈ వార్త ఒక సెన్సేషన్.

ఎవరికీ దక్కని అదృష్టం మా అభిమాన హీరోకి దక్కింది అంటూ అభిమానులు మురిసిపోయారు. మహేష్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన మైనపు బొమ్మని ప్రతిష్టించారు. ఆ తర్వాత గత ఏడాది అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇప్పుడు రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రాన్ని కూడా త్వరలోనే ప్రతిష్టించనున్నారు. ఆయన తన పెంపుడు కుక్క రైమ్ ని తన చేతిలో పట్టుకొని స్టైల్ గా కూర్చున్నట్టుగా ఈ మైనపు విగ్రహం ఉంటుంది. ఇటీవలే మ్యూజియం సంబంధిత అధికారులు కొలతలు తీసుకొని వెళ్లారు.

ఇలా టాలీవుడ్ లో ఆరు మంది స్టార్ హీరోలు ఉంటే, అందులో నలుగురి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి, ఒక్క పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కి సంబంధించినవి తప్ప. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమా చేయలేదు కాబట్టి, ఆయన విగ్రహం ప్రతిష్టించకపోవడం లో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు #RRR చిత్రం ద్వారానే గ్లోబల్ వైడ్ గా ఆడియన్స్ కి చేరువ అయ్యారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ కంటే ముందు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టారంటే, ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా ఎక్కువ క్రేజ్ ఉందా అనే సందేహాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ వంటి పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అయినా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆయన మైనపు విగ్రహాన్ని కూడా మేడం తుస్సాద్స్ లో ప్రతిష్టించే అవకాశాలు లేకపోలేదు. ఎన్టీఆర్ కి కూడా అతి త్వరలోనే ఈ గౌరవం దక్కొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version