Madame Tussaud Museum : టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న టాప్ 2 హీరోల లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్లిద్దరికీ ఉన్నటువంటి క్రేజ్, ఫాలోయింగ్ ఎవరికీ లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే వీళ్ళిద్దరికి దక్కని అరుదైన గౌరవం, మిగిలిన స్టార్ హీరోలందరికీ దక్కింది. ఇదే ఇప్పుడు ఇరువురి హీరోల అభిమానులకు నిరాశగా మిగిలింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సింగపూర్ లో ఉండే మేడమ్ తుస్సాద్స్ మ్యూజియం లో మన టాలీవుడ్ హీరోలకు సంబంధించిన మైనపు బొమ్మలు ప్రతిష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. అందరికంటే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పట్లో ఈ వార్త ఒక సెన్సేషన్.
ఎవరికీ దక్కని అదృష్టం మా అభిమాన హీరోకి దక్కింది అంటూ అభిమానులు మురిసిపోయారు. మహేష్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ కి సంబంధించిన మైనపు బొమ్మని ప్రతిష్టించారు. ఆ తర్వాత గత ఏడాది అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా పెట్టారు. ఇప్పుడు రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రాన్ని కూడా త్వరలోనే ప్రతిష్టించనున్నారు. ఆయన తన పెంపుడు కుక్క రైమ్ ని తన చేతిలో పట్టుకొని స్టైల్ గా కూర్చున్నట్టుగా ఈ మైనపు విగ్రహం ఉంటుంది. ఇటీవలే మ్యూజియం సంబంధిత అధికారులు కొలతలు తీసుకొని వెళ్లారు.
ఇలా టాలీవుడ్ లో ఆరు మంది స్టార్ హీరోలు ఉంటే, అందులో నలుగురి విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి, ఒక్క పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కి సంబంధించినవి తప్ప. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు పాన్ ఇండియన్ సినిమా చేయలేదు కాబట్టి, ఆయన విగ్రహం ప్రతిష్టించకపోవడం లో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు #RRR చిత్రం ద్వారానే గ్లోబల్ వైడ్ గా ఆడియన్స్ కి చేరువ అయ్యారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ కంటే ముందు రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని పెట్టారంటే, ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా ఎక్కువ క్రేజ్ ఉందా అనే సందేహాలు విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఓజీ’, ‘హరి హర వీరమల్లు’ వంటి పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఏ సినిమా అయినా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆయన మైనపు విగ్రహాన్ని కూడా మేడం తుస్సాద్స్ లో ప్రతిష్టించే అవకాశాలు లేకపోలేదు. ఎన్టీఆర్ కి కూడా అతి త్వరలోనే ఈ గౌరవం దక్కొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.