Coolie Trailer Expectations: మితిమీరిన అంచనాలు ఒక సినిమాపై ఉండడం మంచిది కాదు. అలాంటి అంచనాలు ఉన్నప్పుడు ఆశాజనకమైన ఔట్పుట్ వచ్చినప్పటికీ,ప్రేక్షకుల మనసుల్ని సంతృప్తి పరచలేదు. ఫలితంగా సూపర్ హిట్ అవ్వాల్సిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈరోజు విడుదలైన రజనీకాంత్(Superstar Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) మూవీ ట్రైలర్ ని ప్రేక్షకుల్లో ఉన్న మితిమీరిన అంచనాలను తగ్గించడానికి విడుదల చేసినట్టుగా అనిపిస్తుంది. అవసరం అనుకుంటే అనిరుద్ చేత డైరెక్టర్ లోకేష్ ‘పవర్ హౌస్’ పాట సరికొత్త BGM వెర్షన్ తో చాలా మాస్ బీట్ ని అందించి ఉండొచ్చు. కానీ ఆయన అలా చెయ్యలేదు. చాలా నీరసమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు. ఇది సినిమా పై అంచనాలను తగ్గించడానికి కావాలని చేసింది కాక మరేంటి చెప్పండి. ఇప్పుడు సినిమా మీద అంచనాలు తగ్గాయి. యావరేజ్ గా ఉన్నా బ్లాక్ బస్టర్ అనిపించేస్తుంది.
Also Read: కూలీ ట్రైలర్ రివ్యూ: కాస్టింగ్, యాక్షన్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువైందే!
ట్రైలర్ ని చూస్తుంటే సినిమాలో అనేక ఎలివేషన్ సన్నివేశాలు ఉన్నట్టు తెలుస్తుంది. చివర్లో రజనీకాంత్ ఇచ్చిన చిన్న మాస్ టచ్ ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. ఇలా సినిమాలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అన్నీ ట్రైలర్ లో చూపిస్తే కిక్ ఏముంటుంది?, థియేటర్ లోనే చూడండి అన్నట్టుగా ఈ ట్రైలర్ ని కట్ చేశారు. ఇకపోతే ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించిన సన్నివేశాలు కూడా వేరే లెవెల్ లో వచ్చాయి. అందుకు ఉదాహరణ లీక్ అయిన నాగార్జున షూటింగ్ వీడియో నే. విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్ర కి పదింతలు పవర్ ఫుల్ గా ఇందులో నాగార్జున(Akkineni Nagarjuna) ని చూపించాడు. సినిమా విడుదల తర్వాత నాగార్జున క్యారక్టర్ గురించి కొన్నేళ్ల వరకు మాట్లాడుకుంటారని అంటున్నారు. ఆ రేంజ్ విలనిజాన్ని పండించాడు ఆయన. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమేరకు అలరిస్తుందో చూడాలి.