Ghosts Time Sense: కొంతమంది ఉన్నాయని.. కొంతమంది లేవని.. ఇలా రకరకాల చర్చల మధ్య ఎప్పుడూ ఒకప్పుడు దెయ్యాల గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది.. ఇప్పటికి మనదేశంలోని మారుమూల గ్రామాలలో మంత్రాలని, తంత్రాలని ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. ఇందులో కొందరు నమ్ముతుంటారు.. మరికొందరు అదంతా ఉత్తి ప్రచారమని కొట్టిపారేస్తుంటారు. దెయ్యాలు ఉన్నాయా? లేవా? అనే ప్రశ్న ఈనాటిది కాదు.. ఎవరి అభిప్రాయాలకు తగ్గట్టుగా వారు సమాధానాలు చెబుతుంటారు. అయితే ఇందులో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనే ప్రశ్నలకు మన నమ్మకమే సమాధానం.
Also Read: అంచనాలు తగ్గించడం కోసం కావాలని ‘కూలీ’ ట్రైలర్ ని అలా కట్ చేశారా?
అయితే ఇప్పుడు దెయ్యాలకు సంబంధించి ఒక చర్చ నడుస్తోంది.. పూర్వం 18 వ శతాబ్ద కాలంలో యూరప్ ప్రాంతంలో మాల్టా లో కరువు కాటకాలు విపరీతంగా ఉండేవి. దీనికి తోడు అంటువ్యాధులు తీవ్రంగా ప్రబలేవి. ప్రజలు చనిపోతూ ఉండేవారు. పైగా రాత్రిపూట వింత వింత శబ్దాలు, వింత వింత మనుషులు కనిపించేవారు. అభి ముమ్మాటికి దెయ్యాలని అప్పటి ప్రజలు నమ్మేవారు. యూరప్ లో క్రైస్తవ మతం ఉంటుంది కాబట్టి.. క్రైస్తవ మత చెప్పినట్టుగా అక్కడి ప్రార్థన మందిరాల మీద విభిన్నమైన సమయాలు సూచించే గడియారాలు ఏర్పాటు చేశారు. దీంతో కొద్దిరోజులకు వింత వింత శబ్దాలు.. వింత వింత మనుషులు కనిపించడం తగ్గిపోయారు.. కరువు కాటకాలు, ఇతర సమస్యలు దూరమయ్యాయి. దీంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
నాటి కాలంలో రెండు గడియారాలను ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన కారణం దెయ్యాలను తప్పుదోవ పట్టించడమేనట. కుడివైపు అసలు సమయాన్ని సూచించే గడియారం.. ఎడమ వైపు తప్పుడు సమయాన్ని సూచించే గడియారాన్ని ఏర్పాటు చేశారట. అప్పట్నుంచి మాల్టా మాత్రమే కాదు.. ఆ పరిసర ప్రాంతాల్లోని చర్చిలలో ఇలానే గడియారాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతోంది. కాలక్రమంలో అభివృద్ధి పెరుగుతుంది కాబట్టి.. ప్రజల ఆలోచన విభిన్నంగా సాగుతోంది. రెండు గడియారాలలో ఒక గడియారం జాలర్లు, వృత్తి పని చేసే వారి కోసమని.. రెండవ గడియారం స్థానికుల కోసమని చర్చ నడుస్తోంది. ఈ చర్చను ఇలా దారి మళ్ళించడానికి కారణం కూడా ఉంది. దెయ్యాలు.. భూతాలు అని ప్రచారం చేస్తే ప్రజలు భయపడే అవకాశం ఉందని దాన్ని అలా మార్చారు. మరోవైపు ఇప్పటికీ ఈ ప్రాంతంలో విశ్వాసులు చర్చి గంట మోగినప్పుడే ప్రార్థనకు వెళ్తుంటారు. గడియారంతో సంబంధం లేకుండా ప్రభువు సేవలో తరించి వస్తారు.
ఇప్పటి కాలంలో ప్రేతాత్మలు ఉన్నాయని.. అవి ఇబ్బంది పెడతాయని.. అనే నమ్మకాలు లేకపోయినప్పటికీ.. చెడు ఆత్మలు సంచరిస్తుంటాయని.. అటువంటి వాటికి దూరంగా ఉండాలని.. ప్రభు సేవలో తరించడమే ఏకైక నివారణ మార్గమని అక్కడి విశ్వాసులు నమ్ముతుంటారు. అందువల్లే ఎక్కువసేపు వారు చర్చిలో గడుపుతుంటారు. నేటికి కూడా వారు చర్చి గంట మోగించినప్పుడే.. ఆ సమయాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు.