Coolie Trailer Review: తమిళ ప్రేక్షకుల తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్(Super Star Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) మూవీ ట్రైలర్ ని కాసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా, అనిరుద్(Anirudh Ravinchander) సంగీతం, అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి టాప్ స్టార్స్ ఉన్నారు, కాబట్టి ప్రతీ ఒక్కరు అంచనాలు భారీ గా పెట్టుకుంటారు. ముఖ్యంగా ట్రైలర్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోవాలి కోరుకుంటారు. ఒక సినిమాకు భారీ రేంజ్ లో హైప్ రావాలంటే ట్రైలర్ లో కచ్చితంగా ఇలాంటివి పేలాల్సిందే. కానీ కూలీ మూవీ ట్రైలర్ కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చాలా నీరసంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించాడు. ట్రైలర్ లో కూడా వేరే లెవెల్ షాట్స్ ఏమి పెట్టలేదు, ఎదో ఊహించుకుంటే ఎదో అయ్యింది అన్నట్టుగా ఈ ట్రైలర్ ఉంది.
Also Read: సిక్స్ కొట్టగానే అమ్మాయిలను ఎందుకు చూపిస్తారంటే..
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) మొట్టమొదటిసారి విలన్ క్యారక్టర్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించి బలమైన సన్నివేశాలు ఏమైనా పెడతాడేమో అని అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. కానీ ఆయన షాట్స్ కూడా పెద్దగా పెట్టలేదు. లీక్ అయిన షూటింగ్ వీడియో నాగార్జున విలనిజం ని చూస్తే భయం వేస్తాది. అది ట్రైలర్ లో పెట్టి ఉండుంటే బాగుండేది కానీ పెట్టలేదు. రజనీకాంత్ వి కొన్ని హీరోయిజం షాట్స్ బాగున్నాయి. ముఖ్యంగా చివర్లో వచ్చే వింటేజ్ షాట్ అభిమానులకు గూస్ బంప్స్ రప్పించింది. ఇక ఆయన హీరోయిన్ శృతి హాసన్(Sruthi Haasan) తో చేసిన కొన్ని ఎమోషనల్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని చూపించారు, అవి కూడా అనుకున్నంత రేంజ్ లో లేవు. ఓవరాల్ గా ట్రైలర్ బిలో యావరేజ్ లాగా అనిపించింది. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బలంగా కొట్టి ఉండుంటే ఈ ట్రైలర్ వేరే లెవెల్ లో ఉండేది.
పవర్ హౌస్ పాట థీమ్ ని ఉపయోగించినా అదిరిపోయేది. కానీ ఆయన కాస్త డిఫరెంట్ గా ప్రయత్నం చేశాడు. ఇది అనిరుద్ ఆలోచననా?, లేకపోతే డైరెక్టర్ లోకేష్ ఆలోచననా? అనేది తెలియదు కానీ, మొత్తానికి ట్రైలర్ పవర్ ని చెడగొట్టారు. ఇది మూవీ హైప్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో చూడాలి. ట్రైలర్ కి వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని తీసుకొని విడుదల లోపు మరో రిలీజ్ ట్రైలర్ ని వదిలితే బాగుంటుంది అని అభిమానుల కోరిక. మరి మేకర్స్ ఆ కోరిక నెరవేరుస్తారో లేదో చూడాలి. ట్రైలర్ ని క్రింద అందిస్తున్నాము. చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.