War 2 vs Coolie: ప్రస్తుతం రిలీజ్ అవుతున్న సినిమాల మధ్య చాలా పెద్ద పోటీ అయితే నడుస్తోంది. ఒక్కో భాష నుంచి వచ్చిన పెద్ద సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉండటమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే లభిస్తోంది. మరి ఇలాంటి క్రమంలోనే ఆగస్టు 14వ తేదీన తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూలీ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోంది. ఇక అదే రోజున బాలీవుడ్ సినిమా అయిన వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతోంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఏ సినిమా నిరాశ పరుస్తోంది అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది… కూలీ సినిమా సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తుంది. ఇక వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ఉన్నప్పటికి ఈ సినిమా అఫీషియల్ గా బాలీవుడ్ సినిమా…మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉపయోగం గా ఉంటుంది అనే ధోరణిలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. నిజానికి సౌత్ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే చాలా వరకు డెవలప్ అవుతోంది.
Also Read: సినిమా షూటింగులు బంద్…కానీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ నడుస్తోందా..?
ఒకప్పుడు నార్త్ వాళ్ళు మన సౌత్ వాళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు…కానీ ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్లోకి వెళ్తుంది. కాబట్టి పాన్ ఇండియాలో మన సినిమాలకే ఎక్కువ ఆదరణ లభిస్తున్న క్రమంలో ఈ రకంగా కూలీ సినిమా సక్సెస్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా వరకు హెల్ప్ అవుతోంది.
వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ గాని సౌత్ సినిమా ఇండస్ట్రీకి క్రెడిబులిటీ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా ఆడితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కూడా మంచి నేమ్ వస్తోంది కదా అంటే ఆ సినిమాకి సక్సెస్ఫుల్ టాక్ వచ్చేంత వరకే మన ఎన్టీఆర్ ని వాడుకుంటారు.
Also Read: ‘కూలీ’ కి తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ టికెట్ రేట్స్..ఇదేమి దోపిడీ!
ఆ తర్వాత అది బాలీవుడ్ వాళ్ళు సాధించిన విజయంగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కాబట్టి వార్ 2 కంటే కూడా కూలీ సినిమా సక్సెస్ అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీకి మరింత పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి…తద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా తెలియకుండానే కొంతవరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…