Athadu Re-Release: సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న అతడు(Athadu Movie) చిత్రాన్ని రీసెంట్ గానే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీవీ టెలికాస్ట్ లో జనాలు వందల సార్లు రిపీట్ గా చూడడం వల్లనో ఏమో తెలియదు కానీ, రీ రిలీజ్ లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని 3 కోట్ల 50 లక్షలకు కొనుగోలు చేశారు. మొదటి రెండు రోజులకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. గ్రాస్ కూడా నాలుగు కోట్ల రూపాయిల కంటే తక్కువ వచ్చింది. దీంతో ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్స్ కి కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. విడుదలకు ముందు ఈ సినిమా పై అంచనాలు చాలా భారీగా ఉండేవి.
Also Read: ‘కూలీ’ కి తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ టికెట్ రేట్స్..ఇదేమి దోపిడీ!
కచ్చితంగా రీ రిలీజ్ రికార్డ్స్ అన్నిటిని భారీ మార్జిన్ తో అధిగమించి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ చివరికి టాప్ 5 లో కూడా స్థానం సంపాదించుకోలేక పోవడమే కాకుండా, నష్టాలను కూడా మిగిలించింది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే, నార్త్ అమెరికా లో మాత్రం ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది. మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి లక్ష డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. మరో 8 వేల డాలర్లు వస్తే ఆల్ టైం రికార్డు గా నిలుస్తుంది. ప్రస్తుతం నార్త్ అమెరికా లో ఆల్ టైం రికార్డు గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాగా మహేష్ ఖలేజా నిల్చింది. ఈ చిత్రం తర్వాత లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లను దాటిన రెండవ సినిమాగా మళ్ళీ మహేష్ సినిమానే నిల్చింది.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
దీనిని బట్టీ ఓవర్సీస్ లో మహేష్ బాబు క్రేజ్ చెక్కు చెదర్లేదని చెప్పొచ్చు. అయితే నార్త్ అమెరికా లో కూడా మొదటి రోజు ఆల్ టైం రికార్డు గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రంగా ‘గబ్బర్ సింగ్’ నే కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానం లో మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర చిత్రం ఉంది. కానీ ఫుల్ రన్ రికార్డ్స్ మాత్రం రెండు మహేష్ బాబు పేరు మీదనే ఉన్నాయి. మరి మహేష్ పెట్టిన ఈ రెండు అరుదైన రికార్డ్స్ ని ఎవరు రాబోయే రోజుల్లో బద్దలు కొట్టబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. చాలా మంది ‘బాహుబలి – ది ఎపిక్’ చిత్రం అక్టోబర్ నెలలో బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓవర్సీస్ లో ఈ రీ రిలీజ్ ఎవ్వరూ అందుకోలేని బెంచ్ మార్క్స్ ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు, మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.