Andhra Pradesh Liquor Scam: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం సృష్టిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని స్పష్టమౌతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. దాదాపు 40 మంది వరకు ఈ కేసులో నిందితులు. ఇప్పటివరకు 12 మంది అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం తన రెండు ఛార్జ్ షీట్ ను సోమవారం విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 200 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్లో ముగ్గురిపై కీలక ఆరోపణలు చేసింది. ప్రధానంగా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఈ స్కాం లో కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించింది. అయితే పలుమార్లు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించడం విశేషం.
Also Read: మద్యం యాపారంలో సరికొత్త లింకులు!
బేవరేజెస్ ప్రేక్షక పాత్ర..
2019లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలోకి వచ్చింది. మద్యం పాలసీని మార్చింది. అప్పటివరకు ప్రైవేటు వ్యాపారులు మద్యం నిర్వహిస్తుండగా.. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా మద్యం విక్రయాలను నియంత్రించింది. అప్పుడే అవినీతికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఒక వ్యవస్థాగత సిండికేట్ ఏర్పాటు జరిగిందని.. సిట్ తన ఛార్జ్ షీట్ లో స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్ షీట్ నమోదు చేసిన సిట్.. తాజాగా ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అయితే ఇందులో అనేక కీలక అంశాలను బయటపెట్టింది. ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రను స్పష్టం చేసింది. ప్రతి దశలో అనైతికంగా అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ధనుంజయ రెడ్డి జోక్యం చేసుకున్నారని చూపించగలిగింది.
పక్కా ఆధారాలతో..
అయితే పక్కా ఆధారాలను సేకరించింది ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team). కాల్ డేటా రికార్డులు, గూగుల్ టేక్ అవుట్ ఫైల్స్, ల్యాప్టాప్ డేటా ఆధారంగా వీరి సంప్రదింపులు, అక్రమ లావాదేవీలను సిట్ గుర్తించింది. ఒక్కో లిక్కర్ కేసుకు 150 నుంచి 200 రూపాయల వరకు ముడుపుగా వసూలు చేసినట్లు.. నెలకు సుమారుగా 50 నుంచి 60 కోట్ల వరకు సేకరించినట్లు సిట్ పేర్కొంది. ఈ నగదు హవాలా లావాదేవీల ద్వారా దుబాయ్, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే మొత్తం వ్యవహారాలను వివరించే క్రమంలో.. ఛార్జ్ షీట్లో జగన్ పేరును పలుమార్లు ప్రస్తావించింది సిట్.
Also Read: సొంత వాహనాల్లోనే ‘మద్యం’ సొమ్ము.. సిట్ ఉచ్చులో ఆ ముగ్గురు!
జగన్ సూత్రధారి అంటూ..
మద్యం కుంభకోణంలో( liquorscam) సూత్రధారి జగన్ అని స్పష్టం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అనేక నిర్ణయాల్లో నాటి సీఎం జగన్ పాత్ర ఉందని తేల్చింది. మద్యం అమ్మకాల విధానాల్లో మార్పు ఆయన పనేనని స్పష్టం చేసింది. ఒక వ్యవస్థీకృతమైన విధానం ద్వారా మద్యం కుంభకోణానికి పాల్పడినట్లు స్పష్టం చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం. నేరుగా సీఎం సన్నిహితులకు మద్యం ముడుపులు అందాయని… ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ భారీగా ఆస్తులు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే మనీ లాండరింగ్ ద్వారా దుబాయ్ కంపెనీలకు ముడుపుల సొమ్ము చేర్చింది ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అని స్పష్టం అయింది. అయితే ఈ మొత్తం నిందితుల మధ్య ఫోన్ సంభాషణలకు సంబంధించిన సమాచారం కూడా సిట్ సేకరించింది. ఫోన్ల లొకేషన్ లతో కీలక సమాచారాన్ని రాబెట్టింది. ఫోరేనిక్స్ విశ్లేషణలతో నిర్ధారణ చేసుకుంది. మద్యం సరఫరా ఆర్డర్లు మార్చేసి… ఆధారాలను సైతం ధ్వంసం చేసినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే అంతిమ లబ్ధిదారుడు జగన్ అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది సిట్. తద్వారా మూడో ఛార్జ్ షీట్లో నేరుగా అప్పటి సీఎం జగన్ ప్రమేయాన్ని మరింత నిర్ధారించి… స్పష్టతనివ్వనున్నట్లు అర్థమవుతోంది.