Coolie Movie Ticket Cost: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ కి ఎంతో సపోర్టుగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ ప్రభుత్వం లో టికెట్ హైక్స్ దొరకడం అంత తేలికైన విషయం కాదు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్స్ ని పెంచుకునే వెసులుబాటు కలిగిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇది కాస్త అతిశయం అనే అనుకోవాలి. బాహుబలి ,#RRR, కల్కి వంటి భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్స్ ని పెంచుకునే వెసులుబాటు కల్పించడం లో ఎలాంటి తప్పు లేదు. అలా కాకుండా నాని లాంటి మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్స్ పెంచుకునే వెసులుబాటు కల్పించడం ఎంత వరకు కరెక్ట్?. సినీ ఇండస్ట్రీ బాగు కోసం వాళ్ళు కోరింది ఇస్తుండొచ్చు, కానీ జనాలను కూడా అర్థం చేసుకోవాలి కదా.
Also Read: ఎవరెన్ని చెప్పిన ‘వార్ 2’ లో ఎన్టీఆర్ సెకండ్ హీరోనేనా..?
సినిమా అనేది నిత్యావసర వస్తువు కాదు, మనకి నచ్చితే చూస్తాం, లేదంటే ఓటీటీ లో వచ్చేంత వరకు ఆగుతాం. అంతిమంగా నష్టపోయేది నిర్మాతనే. ఇది నిర్మాతలే గ్రహించాలి. సినిమాని ఆడియన్స్ కి బాగా దూరం చేస్తున్నారు. మన తెలుగు సినిమాల వరకు టికెట్ హైక్స్ ఇస్తున్నారు, పోనిలే అనుకుందాం, డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ హైక్స్ అవసరమా?, సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) నటిస్తున్న ‘కూలీ'(Coolie Movie) చిత్రం మరో రెండు రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం తమిళ ఆడియన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో, మన తెలుగు ఆడియన్స్ కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. హైప్ అయితే భారీగానే ఉంది, కానీ నిర్మాతలు ఆ హైప్ ని క్యాష్ చేసుకొని జనాల నుండి డబ్బులు దోచుకోవాలని చూస్తున్నారు, ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదనే చెప్పాలి. కూలీ చిత్రానికి తమిళనాడు మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఉన్న రేట్స్ కంటే రెండింతలు మన దగ్గర ఎక్కువ రేట్స్ ఉన్నాయి.
Also Read: కాళ్ళు లేని వ్యక్తి ‘బిగ్ బాస్ 9’ లోకి..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!
భారీ హైప్ ఉన్న సినిమా కాబట్టి ప్రతీ ఒక్కరు ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే చూడాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ ఆసక్తి ని ఇలా డబ్బులతో కొనుగోలు చెయ్యాలని అనుకోవడం కరెక్ట్ కాదు కదా. కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. ‘వార్ 2’ చిత్రానికి కూడా అదే విధంగా టికెట్ రేట్స్ పెంచారు. ఇది కూడా డబ్బింగ్ సినిమానే కదా , దీని గురించి ఎందుకు అడగరు అని కొంతమంది అడగొచ్చు. కానీ ‘వార్ 2’ ద్విభాషా చిత్రం, డబ్బింగ్ సినిమా కాదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కూడా జారీ చేసింది. ఆ చిత్రం లో హీరో గా నటించిన హృతిక్ రోషన్ హైదరాబాద్ కి కూడా వచ్చాడు ప్రొమోషన్స్ కోసం. కానీ కూలీ కి ఏ ప్రాతిపదికన టికెట్ హైక్స్ పెంచారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల పై ఈ అంశం మీద తీవ్రమైన నెగిటివిటీ మూవీ లవర్స్ నుండి వ్యక్తం అవుతుంది.