War 2 Teaser : ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటిస్తున్న చిత్రం ‘వార్ 2′(War 2 Movie) రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారక్టర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట. ఇలాంటి కబుర్లు సోషల్ మీడియా లో ప్రతీ రోజులు కనిపిస్తూనే ఉంటాయి కానీ, అసలు ఈ సినిమా నుండి కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్, లేదా టీజర్ ని అయినా విడుదల చేస్తారా అని అభిమానులు ఎప్పటి నుండో యాష్ రాజ్ ఫిలిమ్స్ ని ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎట్టకేలకు యాష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ అభిమానుల ఆకలి ని అర్థం చేసుకుంది.
Also Read : వార్ 2′ లో 20 నిమిషాలు ఎన్టీఆర్ అలా కనిపించబోతున్నాడా..? ఫ్యాన్స్ కి పండగే!
ఈ నెల 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుండి టీజర్ విడుదల చేయబోతున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన ట్వీట్ ని కాసేపటి క్రితమే ఆ చిత్ర హీరో హృతిక్ రోషన్ తెలిపాడు. మాములుగా చెప్పకుండా సినిమాలో తన క్యారక్టర్ స్టైల్ లోనే చెప్పాడు. ఆయన మాట్లాడుతూ ‘హే ఎన్టీఆర్..ఈ నెల 20 న ఏమి జరగబోతుందా తెలుసా..? నన్ను నమ్ము, నువ్వు కలలో కూడా ఊహించనిది నా దగ్గర ఉంది..రెడీ ఉన్నావా?’ అంటూ ట్విట్టర్ లో ట్వీట్ వేసాడు. దీనికి ఇంకా ఎన్టీఆర్ నుండి రిప్లై రాలేదు, కచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు రిప్లై వస్తుందని ఆశిస్తున్నారు. ఈ టీజర్ లో కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఉంటాడా?, లేదా ఎన్టీఆర్ తో హృతిక్ రోషన్ కూడా ఉంటాడా అని అభిమానులు ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
Also Read : ఎన్టీయార్ కి వార్ 2 సినిమాతో వరుసగా 8 వ సక్సెస్ దక్కుతుందా..?
ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ కి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది నాటు నాటు పాట వల్లనే. రామ్ చరణ్ తో కలిసి ఆయన వేసిన స్టెప్పులకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ హృతిక్ తో కలిసి ఆ రేంజ్ స్టెప్పులు వేసాడట. ఈ పాట అద్భుతంగా వచ్చిందని అంటున్నారు మేకర్స్. క్లైమాక్స్ కి 15 నిమిషాలు ముందు ఈ పాట వస్తుందట. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులకు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుందనే టాక్ కూడా ఉంది. అయితే ఈ సినిమా విడుదల రోజునే రజనీకాంత్ కూలీ చిత్రం కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా మీద కూడా అంచనాలు భారీ గా ఉన్నాయి. భీభత్సమైన క్లాష్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Hey @tarak9999, think you know what to expect on the 20th of May this year? Trust me you have NO idea what’s in store. Ready?#War2
— Hrithik Roshan (@iHrithik) May 16, 2025