War 2 Movie: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మల్టీస్టార్రర్ చిత్రం ‘వార్ 2′(War 2 Movie). షూటింగ్ కార్యక్రమాలను దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మన అందరికీ తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ ఇందులో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడని. ఆయన సినిమాలో ఎందుకు నెగటివ్ గా మారాడో చూపించే సన్నివేశాలు ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయట. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మరోసారి తన నట విశ్వరూపాన్ని మొత్తం బయటకు తీసే అవకాశం దక్కింది అట. ఇకపోతే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు అయితే నా వార్తని చూసి పూనకాలొచ్చి ఊగిపోతున్నారు. ఇంతకు నా వార్త ఏంటో, అభిమానులు ఎందుకు అంత సంతోషిస్తున్నారో ఒకసారి చూద్దాం.
Also Read : నాకు వచ్చిన కష్టాలు జీవితంలో ఎవరికీ రాకూడదు – సమంత
ఈ చిత్రం లో ఎన్టీఆర్ పై ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారట. సుమారుగా 20 నిమిషాల పాటు ఈ యాక్షన్ సన్నివేశం ఉంటుందని టాక్. ఇందులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీ తో షర్ట్ లెస్ గా కనిపిస్తాడట. ఆ సన్నివేశం సినిమాకే పెద్ద హైలైట్ కాబోతుందని టాక్. ఎన్టీఆర్ గతంలో కూడా షర్ట్ లెస్ సన్నివేశాల్లో నటించాడు. ఆయన చొక్కా విప్పిన ప్రతీసారీ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వడాన్ని మనం గమనించొచ్చు. గతంలో ఆయన వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించిన చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రంలో ఒక పాటలో ఆయన చొక్కా లేకుండా సిక్స్ ప్యాక్ బాడీ తో కనిపిస్తాడు. ఆ తర్వాత ‘అరవింద సమేత’ లోని ఇంట్రడక్షన్ ఫైట్ సన్నివేశంలో దాదాపుగా పది నిమిషాల పాటు ఆయన చొక్కా లేకుండా కనిపిస్తాడు. ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే.
అదే సెంటిమెంట్ ‘వార్ 2’ చిత్రానికి కూడా వర్తిస్తుందని, కచ్చితంగా ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్. టెంపర్ చిత్రం నుండి అసలు అపజయం అనేదే ఎరుగకుండా వరుసగా 7 బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్, ఇప్పుడు 8వ బ్లాక్ బస్టర్ ని కొట్టబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో ‘డ్రాగన్’ అనే చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ లేకుండా షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఈ నెల 22 నుండి ఎన్టీఆర్ కూడా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. వచ్చే ఏడాది వేసవి లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ చిత్రం తర్వాత ‘దేవర 2′(Devara 2), అదే విధంగా నెల్సన్ దిలీప్ కుమార్ తో మరో సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్.
Also Read : ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..?