Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీని అమాంతం తారాస్థాయి తీసుకెళ్లిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)… ఆయన గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇక మీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న ఆయన ఇప్పుడు యంగ్ డైరెక్టర్లతో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి (Anil Ravipudi), శ్రీకాంత్ ఓదెల (Stikanth Odela) లాంటి దర్శకులు తనతో సినిమాలు చేస్తున్నప్పటికి మరి కొంతమంది యంగ్ డైరెక్టర్లతో సినిమాలను చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ మంచి విజయాలుగా మారడమే కాకుండా ఆయనకు గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. ఇక ఆయన సినిమాpa కోసం ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కూడా కమర్షియల్ సినిమానే చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం. ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్ని సినిమాలు చేసినప్పటికి కొన్ని సినిమాలు మాత్రమే ఆయనకు ప్రత్యేకంగా ఒక మంచి స్థానాన్ని కల్పించాయని చెప్పాలి. ఇక ఆయనతో హరీష్ శంకర్, మారుతి, వెంకీ కుడుముల లాంటి స్టార్ డైరెక్టర్లు అందరూ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : చిరంజీవి పక్కన రొమాన్స్ చేసిన ఆ హీరోయిన్ ఇప్పుడు చిరంజీవితో ఎత్తుకు పై ఎత్తు వేయబోతుందా..?
చిరంజీవి మాత్రం చాలా సెలెక్టెడ్ గా దర్శకులను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ప్రస్తుతానికైతే అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమాలను చేస్తున్న ఆయన మరి కొంతమంది దర్శకులకు అవకాశాలను ఇచ్చే ఛాన్సులైతే ఉన్నాయి.
తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో భారీ విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక గొప్ప ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి అయితే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని గొప్ప స్థాయిలో నిలబెట్టాయి.
ఇక మీదట ఆయన చేయాబోతున్న సినిమాలు ఆయనకు నటుడిగా ఒక చిరస్మరణీయమైన గుర్తింపును తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఆయన ఎంతమంది యంగ్ డైరెక్టర్ లకి అవకాశాలను ఇస్తాడు. తద్వారా తనను తాను ఎలా కొత్తగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : నాగార్జున ఇండస్ట్రీ హిట్ కొట్టకుండా అడ్డుకున్న చిరంజీవి,బాలయ్య…ఏం జరిగిందంటే..?