https://oktelugu.com/

War 2 : ఎన్టీయార్ కి వార్ 2 సినిమాతో వరుసగా 8 వ సక్సెస్ దక్కుతుందా..?

War 2 : నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు.

Written By: , Updated On : March 21, 2025 / 10:16 AM IST
War 2

War 2

Follow us on

War 2 : నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్నాయి. తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘త్రిబుల్ ఆర్’ (RRR), దేవర (Devara) సినిమాతో పాన్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)… నందమూరి నట వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన దేవర సినిమాతో భారీ విజయాన్ని సాధించిన ఆయన ఇప్పుడు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక హృతిక్ రోషన్ (Hruthik Roshan) తో కలిసి చేస్తున్న వార్ 2 (War 2) సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేయడం వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటూ కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. అయినప్పటికి ఆయన బాలీవుడ్ మార్కెట్ కోసమే హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : లీకైన ‘వార్ 2’ ఫైట్ సీన్..ట్రైన్ ఫైట్ సీన్ మామూలు రేంజ్ లో రాలేదుగా..పూర్తి వివరాలు చూస్తే మెంటలెక్కిపోతారు!

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కనుక సక్సెస్ సాధిస్తే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వరుసగా ఎనిమిదో విజయాన్ని సాధించిన హీరోగా మంచి రికార్డులను క్రియేట్ చేస్తాడు. లేకపోతే మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ లను సాధించిన ఆయన సక్సెస్ ల పరంపరకి బ్రేక్ పడుతుందనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. త్రిబుల్ ఆర్ (RRR) సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న ఆయన దేవర సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్ అయితే ఎక్కాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. ఇకమీదట రాబోయే సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను క్రియేట్ చేయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మొత్తానికైతే వార్ 2 సినిమాతో సక్సెస్ సాధిస్తే బాలీవుడ్ ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ ను మరింత ఓన్ చేసుకునే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది. తద్వారా ఎన్టీయార్ హృతిక్ రోషన్ లకి ఎలాంటి గుర్తింపును తెచ్చిపెడుతుంది అనేది తెలియాల్సి ఉంది…

Also Read : వార్ 2′ విడుదల తేదీ పై సంచలన ప్రకటన చేసిన మూవీ టీం..ఇక అభిమానులకు పండగే!