Coolie Movie Collection Day 7: తమిళ సినిమాలకు వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ కల కలగానే మిగిలిపోయేలా ఉంది. వాళ్ళ ఆశలన్నీ రీసెంట్ గా విడుదలైనా ‘కూలీ'(Coolie Movie) చిత్రం మీదనే ఉండేవి. కచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని తమిళనాడు ట్రేడ్ వర్గాలు సవాళ్లు కూడా చేసుకున్నాయి. కానీ చివరికి 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) సెకండ్ హాఫ్ సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండుంటే కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు మార్కుని అందుకొని ఉండేది, కానీ ఒక మంచి థ్రిల్లర్ గా వెళ్లాల్సిన స్టోరీ ని కాంప్లెక్స్ గా మార్చేసి గజిబిజి గందరగోళంగా చేయడం తో ఈ సినిమా అనుకున్న టార్గెట్ ని చేరుకోలేకపోయింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం ఊహించినట్టుగానే భారీ రేంజ్ లో వచ్చాయి కానీ, ఆ తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం వసూళ్లు భారీగా తగ్గిపోయాయి.
Also Read: ‘అగ్నిపరీక్ష’ షోలో అభిజిత్ పై సంచలన ఆరోపణలు చేసిన కంటెస్టెంట్..వీడియో వైరల్!
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారం లో 450 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే, 46 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకోగా, ఇప్పటి వరకు 38 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే మరో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది. ఈ వీకెండ్ తోనే ఆ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే తమిళనాడు ప్రాంతం లో 114 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. ఇక్కడ మాత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అనిపిస్తుంది.
ఇంకా గట్టిగా చెప్పాలంటే తమిళనాడు వరకు ఈ చిత్రం ఫ్లాప్ గా మిగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా తమిళనాడు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే కచ్చితంగా 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అంత షేర్ రావాలంటే కచ్చితంగా 240 కోట్ల రూపాయలకు పైగా తమిళ నాడు ప్రాంతం నుండి గ్రాస్ వసూళ్లు రావాలి. కానీ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే ఈ చిత్రం 170 కోట్ల రూపాయిల గ్రాస్ కి మించి ఒక్క రూపాయి కూడా రాబట్టేలా కనిపించడం లేదు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక లో 36.75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 22.55 కోట్ల రూపాయిల గ్రాస్, హిందీ వెర్షన్ లో 33 కోట్ల రూపాయిల గ్రాస్, ఓవర్సీస్ లో 162 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ తో 500 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంచనా.