War 2 Opening Day Collection: ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద కంటెంట్ రూలింగ్ నడుస్తుంది. చిన్న పెద్ద హీరోలు అని తేడా లేదు, కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తున్నారు, ఒకవేళ బాగాలేకపోతే మొదటి రోజే ఇంటికి పంపిస్తున్నారు. ఈరోజు విడుదలైన ‘వార్ 2′(War 2 Movie) మూవీ ఎందుకు ఒక ఉదాహరణ. ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కలిసి నటించిన చిత్రం, అది కూడా భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం, అయినప్పటికీ కూడా ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ తో విడుదలకు ముందు ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పోయింది. ఫలితంగా ఈ సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ తెలుగు వెర్షన్ లో నమోదు అయ్యాయి. ఉత్తరాంధ్ర, గుంటూరు జిల్లాలో పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ, ఇతర ప్రాంతాల్లో మాత్రం దారుణమైన వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది నందమూరి ఫ్యాన్స్ కి అసలు మింగుడు పడడం లేదు.
Also Read: ఇంత చిన్న క్యారక్టర్ కోసం 6 సార్లు కథ విన్నాడా..? నాగార్జున జడ్జిమెంట్ పై సందేహాలు!
ఎంత దారుణమైన ఓపెనింగ్స్ అంటే, రీసెంట్ గా విడుదలైన విజయ్ దేవరకొండ కింగ్డమ్ కి వచ్చినంత ఓపెనింగ్ అయినా వస్తుందా లేదో అని అనుకుంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో హైదరాబాద్ సిటీ లోనే భారీ వసూళ్లు నమోదు అవ్వడం లేదు. అసలే పరిమితమైన షోస్, టికెట్ రేట్స్ కూడా లేవు, ఉన్న పరిమితమైన షోస్ కూడా ఫుల్స్ కావడం లేదు, గ్రాస్ పెద్దవి రావడం లేదు, ఇక షేర్స్ ఎక్కడి నుండి వస్తాయి చెప్పండి?, ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను అయినా ఈ సినిమా రాబడుతుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ పండితులు. దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ కూలీ కంటే తక్కువ గ్రాస్ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం. కూలీ చిత్రానికి మొదటి రోజు 15 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల నుండి వస్తే ‘వార్ 2’ 13 కోట్ల షేర్ వస్తుందని అంటున్నారు.
కానీ ఎంతైనా ఎన్టీఆర్ సినిమా, తక్కువ కలెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా హైర్స్, మరియు ఇతర బిజినెస్ టర్మ్స్ లో ఉండేవి జత చేసి, 20 కోట్ల షేర్ మార్కుని దాటిస్తారని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. మరో ఆసక్తి కారణమైన విషయం ఏమిటంటే రేపు ‘వార్ 2’ హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి కానీ, తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఖాళీగానే ఉన్నాయి. రేపు నేషనల్ హాలిడే కాబట్టి, హిందీ లో ఈ చిత్రం 45 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు అభిమానులు. తెలుగు వెర్షన్ వసూళ్లు ఇక దాదాపుగా మర్చిపోదామే. వీకెండ్ తర్వాత క్లోజింగ్ వేసేసుకోవచ్చు, కానీ హిందీ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది.