Coolie Nagarjuna Character: స్టార్ హీరో అయినప్పటికీ మంచి క్యారక్టర్ దొరికినప్పుడు అది పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా చేయడం లో ఎలాంటి తప్పు లేదు. అభిమానులు కూడా స్వాగతిస్తారు. కానీ ఎలాంటి ప్రభావం చూపని రోల్ చేస్తే మాత్రం అభిమానులు అసలు తట్టుకోలేరు. ఇప్పుడు నాగార్జున(Akkineni Nagarjuna) విషయం లో అదే జరిగింది. రెండు నెలల క్రితమే ఆయన కుబేర చిత్రం లో ముఖ్యమైన పాత్ర పోషించాడు. అభిమానులు ఆ క్యారక్టర్ ని తీసుకోలేకపోయారు, అది నాగార్జున రేంజ్ హీరో చేసే క్యారక్టర్ కాదని మండిపడ్డారు. ఇక కూలీ(Coolie Movie) చిత్రం లో ఆయన ఎలాగో విలన్ రోల్ చేస్తున్నాడు, అభిమానులు మొదట్లో కాస్త నిరాశ చెందినా, లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) కచ్చితంగా ‘మాస్టర్’ సినిమాలో విజయ్ సేతుపతి రేంజ్ రోల్ ని డిజైన్ చేసి ఉంటాడని, నాగార్జున కి గట్టి కం బ్యాక్ దొరుకుతుందని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ చివరికి నిరాశే మిగిలింది.
Also Read: ‘ప్యారడైజ్’ లో నాని ని వెన్నుపోటు పొడిచేది ఎవరో తెలుసా..?
నాగార్జున ఏమి చిన్న హీరో కాదు, గత జనరేషన్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్, టాలీవుడ్ టాప్ 3 హీరోలలో ఒకడు, ఎన్నో ఇండీస్ట్రీ రికార్డ్స్ ఉన్నాయి, అలాంటి హీరో నెగిటివ్ రోల్ చేస్తున్నాడు అంటే అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకోవడం సహజమే. కానీ ఇంత రెగ్యులర్ విలన్ క్యారక్టర్ అని మాత్రం అభిమానులు అసలు ఊహించలేకపోయారు. ట్విట్టర్ లో ఒక నాగార్జున అభిమాని ఏమ్మన్నాడంటే ‘ఇతను ఏమి విలన్ రా బాబు..8 ఏళ్ళ నుండి ఒకరు మోసం చేస్తూ తిరుగుతుంటే ఏమి చెయ్యలేడు. కొడుకుని చంపినోడిని ఏమి చెయ్యలేడు, తనకంటే 30 ఏళ్ళు వయస్సు లో పెద్దోడు అయినా హీరో కొడుతుంటే తిరిగి ఒక్క దెబ్బ కొట్టలేడు, కేవలం సిగరెట్ త్రాగడం, మందు కొట్టడం కోసమే ఈ సినిమాలో పెట్టుకున్నట్టు ఉన్నారు’ అంటూ మండిపడ్డాడు. ఇది సగటు అక్కినేని అభిమాని ఆవేదన.
ఫస్ట్ హాఫ్ వరకు నాగార్జున ని చాలా పవర్ ఫుల్ గా చూపించారు. అక్కినేని ఫ్యాన్స్ మా హీరో కి అద్భుతమైన క్యారక్టర్ పడింది అని అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాగార్జున క్యారక్టర్ బాగా పడిపోయింది. ఆయన పాత్ర కంటే ‘మోనికా’ పాటలో డ్యాన్స్ వేసిన సౌబిన్ సాహిర్ క్యారక్టర్ అద్భుతంగా ఉంది, ఉపేంద్ర, రచిత రామ్, అమీర్ ఖాన్ అందరి క్యారెక్టర్స్ బాగున్నాయి. ఒక్క నాగార్జున క్యారక్టర్ తప్ప. మన టాలీవుడ్ లో ఎన్నో ప్రయోగాలు చేసి విజయం సాధించిన నటుడు నాగార్జున. అలాంటి నటుడు ఇప్పుడు ఎంచుకున్న దారి కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఆయన ఎంచుకుంటున్న కథల్లో ఆయన క్యారక్టర్ తాలూకు ప్రభావం అసలు కనిపించడం లేదు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో నాగార్జున మన తెలుగు సినిమాల్లో కూడా విలన్ క్యారెక్టర్స్ చేస్తాడేమో అని అభిమానులు భయపడుతున్నారు.