War 2 collections : తెలుగు రాష్ట్రాల్లో ‘వార్ 2′(War 2 Movie) ఎలా రన్ అవుతుంది అనేది కాసేపు పక్కన పెడితే, హిందీ లో మాత్రం నేడు పబ్లిక్ హాలిడే అవ్వడం తో ఇరగకుమ్మేస్తుంది. ముఖ్యంగా బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 60 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఈమధ్య కాలం లో ఒక సినిమాకు విడుదల రోజు కాకుండా, రెండవ రోజున ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడూ జరగలేదు. హిందీ ఆడియన్స్ పబ్లిక్ హాలిడేస్ లో భారీ గ్రాస్ వసూళ్లను ఇస్తుంటారు. గత ఏడాది హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరో గా నటించిన ‘ఫైటర్’ చిత్రానికి కూడా రెండవ రోజు ఈ రేంజ్ ట్రెండ్ నే కనిపించింది. ఎందుకంటే ఆ సినిమాకు రెండవ రోజు రిపబ్లిక్ డే, ఇప్పుడు ‘వార్ 2’ కి రెండవ స్వాతంత్ర దినోత్సవం కలిసొచ్చింది. ముఖ్యంగా నార్త్ ఇండియా లోని సింగల్ స్క్రీన్స్ లో ఈ సినిమాని చూసేందుకు ఎగబడుతున్నారు.
ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజు హిందీ వెర్షన్ నుండి 45 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయట. ఇది ఈ చిత్రానికి బిగ్ బూస్ట్ అనుకోవచ్చు. ఈ వీకెండ్ వరకు హిందీ వెర్షన్ వసూళ్లకు ఏ మాత్రం డోకా లేదని అంటున్నారు. తెలుగు వెర్షన్ ఎలా ఉన్న హిందీ వెర్షన్ ని మాత్రం హృతిక్ రోషన్ కాపాడాడు అని అంటున్నారు. అయితే తెలుగు ఆడియన్స్ లాగా హిందీ ఆడియన్స్ ఈమధ్య ఉండడం లేదు. తెలుగు ఆడియన్స్ కి ఈమధ్య టాక్ రాకపోతే రెండవ రోజు నుండే థియేటర్స్ వైపు చూడడం ఆపేస్తున్నారు. కానీ హిందీ ఆడియన్స్ మాత్రం అలా కాదు, టాక్ ఎలా ఉన్నప్పటికీ అక్కడి స్టార్ హీరోలకు కనీస స్థాయిలో అయినా ఆదరిస్తారు. ఎంత పెద్ద ఫ్లాప్ అయినా ఒక వారం రోజుల వరకు కలెక్షన్స్ అదిరిపోతాయి.
‘వార్ 2’ చిత్రానికి ఆన్లైన్ రివ్యూస్ చాలా నెగిటివ్ గా వస్తున్నాయి. బుక్ మై షో యాప్ లో కూడా రేటింగ్స్ రోజురోజుకి తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి లో ఈ చిత్రానికి లాంగ్ రన్ ఆశించడం కష్టమే. ఫస్ట్ హాఫ్ వరకు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ చాలా బాగా తీసాడు. యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. హాలీవుడ్ తరహా లో డిజైన్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా వెనకబడ్డాడు. ముఖ్యంగా ఎన్టీఆర్(Junior NTR) ని నెగిటివ్ రోల్ లో చూపించడమే పెద్ద సాహసం, అక్కడే డైరెక్టర్ విఫలం అయ్యాడు. అందుకే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ రాలేదని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే వీకెండ్ లోపు ఈ చిత్రానికి హిందీ వెర్షన్ లో 150 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.