Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షోకి వెళ్లాలని ఉందా? ఇలా చేస్తే చాలు… ఎలా ఎంపిక చేస్తారంటే?

చాలా మంది సామాన్యులు బిగ్ బాస్ కి ఒక్కసారైనా వెళ్ళాలని ఆశ పడుతుంటారు. ఎందుకంటే తక్కువ సమయంలో ఫేమస్ కావచ్చు. సెలెబ్రెటీ అనే హోదాతో పాటు లక్షల్లో డబ్బు వస్తుంది. కానీ బిగ్ బాస్ కి వెళ్లాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. బిగ్ బాస్ టీం ని ఎలా సంప్రదించాలి? సెలెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎలా ఎంపిక చేస్తారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By: S Reddy, Updated On : August 27, 2024 5:11 pm

Bigg Boss 8 Telugu(9)

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ షో బుల్లితెరపై సంచలనంగా అవతరించింది. 2017లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన బిగ్ బాస్ సీజన్ 1 ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటివరకు ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. తాజాగా సీజన్ 8 కి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన ఏడు సీజన్లలో నూతన్ నాయుడు, గంగవ్వ, గణేష్, ఆది రెడ్డి, పల్లవి ప్రశాంత్ సామాన్యులుగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టారు. ఆది రెడ్డి, గంగవ్వ, పల్లవి ప్రశాంత్ లకు సోషల్ మీడియాలో కాస్తో కూస్తో ఫేమ్ ఉంది. కానీ సీజన్ 2లో కంటెస్ట్ చేసిన గణేష్ ప్యూర్ కామనర్ గా హౌస్ లోకి వెళ్ళాడు. ఎటువంటి ఫేమ్ లేనప్పటికీ గణేష్ 12 వారాలు హౌస్ లో రాణించడం విశేషం.

సాధారణంగా కంటెస్టెంట్స్ ని సెలెక్ట్ చేసే ప్రాసెస్ మూడు విధాలుగా జరుగుతుంది. టీవీ ఇండస్ట్రీలోని పాపులర్ నటులు, కమెడియన్స్, సోషల్ మీడియా స్టార్స్ ని ఒక కేటగిరిలో చూస్తారు. సినిమా నటులు మరో కేటగిరి. సామాన్యులు, బిగ్ బాస్ కి వెళ్ళాలని ఆసక్తి ఉన్న ఫేమ్ లేని నటులు చివరి కేటగిరీకి వస్తారు. బుల్లితెర నటులు, కమెడియన్స్, సోషల్ మీడియా స్టార్స్ తో పాటు సినిమా నటులను స్వయంగా బిగ్ బాస్ టీం సంప్రదిస్తారు.

వారికి కాల్ చేసి మీకు ఆసక్తి ఉందా అని అడుగుతారు. ఇంట్రెస్ట్ ఉంటే ప్రాసెస్ మొదలు పెడతారు. రెండు మూడు దశల్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. వారి వ్యక్తిత్వం ఎటువంటిది? ఎంటర్టైన్ చేయగలరా? ప్రతికూల పరిస్థితులను తట్టుకోగలరా? అన్న విషయాలు పరిశీలిస్తారు. సెలెబ్స్ వారిని మెప్పించగలిగితే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడతారు. ఒప్పందం కుదిరితే మెడికల్ టెస్టులు నిర్వహించి కంటెస్టెంట్ గా ఎంపిక చేస్తారు.

మూడో కేటగిరిలో వారు స్వయంగా బిగ్ బాస్ నిర్వాహుకులను కలిసి తమకు ఛాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తారు. ఈ కేటగిరి నుంచి ఇద్దరు లేదా ముగ్గురిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళకి రిటన్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ కేటగిరిలో ఉండే సెలెబ్స్ లేదా సామాన్యులు రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ చేసే ఛాన్స్ ఉండదు. మరీ తక్కువ కాకుండా చెప్పుకోదగ్గ రెమ్యునరేషన్ బిగ్ బాస్ టీం ఫిక్స్ చేస్తారట. ఆసక్తి ఉంటే మేకర్స్ ని కలిసి అప్లై చేసుకోవచ్చు. పోటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెలెక్ట్ అవ్వడం కాస్త కష్టమే.