Naga Chaitanya: అక్కినేని ఫ్యామిలీ నుండి మూడవ తరంలో మంచి క్రేజ్ ఉన్న నటులు ఎవరైనా ఉన్నారా అంటే అది అక్కినేని నాగ చైతన్య మాత్రమే. అక్కినేని అఖిల్ పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ, సరైన స్క్రిప్ట్స్ ఎంచుకోకపోవడం వల్ల ఆయనకి ఇప్పటి వరకు భారీ బ్లాక్ బస్టర్ పడలేదు. కానీ నాగ చైతన్య మాత్రం యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన లవ్ స్టోరీస్ పెద్ద హిట్ అయ్యాయి. కానీ రీసెంట్ గా ఆయన కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ ఇస్తూ అక్కినేని అభిమానులను నిరాశ పరిచాడు. ‘బంగార్రాజు’ చిత్రం వరకు వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకొని మంచి ఊపు మీదున్న నాగచైతన్య, ఆ సినిమా తర్వాత విడుదలైన ‘థాంక్యూ’ చిత్రంతో భారీ డిజాస్టర్ ని అందుకున్నాడు.
ఇక ఆ తర్వాత కస్టడీ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘దూత’ వెబ్ సిరీస్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి రికార్డు స్థాయి వ్యూస్ వచ్చాయి. ఓటీటీ లో పెద్ద హిట్ కొట్టిన నాగ చైతన్య, థియేట్రికల్ గా కూడా ఒక మంచి హిట్ అందుకొని అక్కినేని ఫ్యామిలీ ని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొని రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నాగ చైతన్య ప్లానింగ్ కూడా సెట్ అయ్యింది. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ చిత్రం చేస్తున్నాడు. సుమారుగా 70 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాత అల్లు అరవింద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమాలోని కేవలం ఒక పాట కోసం దాదాపుగా 3 కోట్లు ఖర్చు చేశారట. హైదరాబాద్ నగర శివార్లలో ఈ పాటని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం నుండి 60 మంది కళాకారులను తీసుకొచ్చారట. కేవలం ఒక్క పాట కోసం ఈ స్థాయిలో ఖర్చు చెయ్యడం నాగ చైతన్య సినిమాకి ఇదే తొలిసారి. దీనిని బట్టీ చూస్తుంటే ఆయన రేంజ్ బాగా పెరిగిందని అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండడం వల్ల సినిమా మీద మరింత హైప్ పెరగడానికి కారణం అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమెకి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కేవలం ఆమెని చూసేందుకు థియేటర్స్ కి క్యూలు కట్టే ఆడియన్స్ సంఖ్య ఎక్కువ. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.