Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ‘దశ’ దిశలా అభివృద్ధి..ఈ పది ప్రాంతాలపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లు పూర్తయింది. ఇప్పటికీ చెప్పుకోదగ్గ అభివృద్ధి మాత్రం జరుగలేదు. రాజధాని కూడా లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది.

Written By: Raj Shekar, Updated On : August 27, 2024 5:07 pm

Andhra Pradesh

Follow us on

Andhra Pradesh: 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి సాధించింది. కానీ, ఆంధ్రప్రదేశ్‌ ఉన్న వనరులను కోల్పోవడంతో అభివృద్ధి చెందలేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్‌.. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి నిర్మాణాలు చేపట్టింది. కానీ, 2019 ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ అంతా మారిపోయింది. వైసీపీ అమరావతిని కేవలం శాసన రాజధానిగానే చేస్తామని ప్రకటించింది. కర్నూల్‌ను న్యాయ రాజధానిగా, విశాఖను అడ్మినిష్టేషన్‌ రాజధానిగా చేస్తామని తెలిపింది. దీంతో అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. కోర్టు కేసుల కారణంగా మూడు రాజధానుల అంశం ముందుకు సాగలేదు. కేవలం బటన్లు నొక్కడం, డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా సంక్షేమం అందిస్తున్నామని భావించిన జగన్‌ ప్రభుత్వం కనీసం రోడ్లను కూడా అభివృద్ధి చేయలేదు. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా కావాలని తిరిగి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రస్తుతం అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. రాష్ట్రాన్ని ప్రగతిశీల రాష్ట్రంగా మార్చేందుకు రాబోయే ఐదేళ్లలో 10 ప్రాంతాలను జాబితా చేసింది. అమరావతిలో రాజధాని నగరం నిర్మాణం, నదుల అనుసంధానం, నైపుణ్య గణన, పరిశ్రమలు, సేవలు, జనాభా నిర్వహణ వంటి కొన్ని కీలకమైన అంశాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

– గ్రీన్‌ ఫీల్డ్‌సిటీగా అమరావతి

స్మార్ట్‌ ఫారెస్ట్‌ సిటీ–మెక్సికో, టెలోసా–అమెరికా, ది లైన్‌–సౌదీ అరేబియా, ఓషియానిక్స్‌తోపాటు ప్రపంచంలోని ఆరు అత్యంత భవిష్యత్‌ నగరాల్లో ఒకటిగా అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని నగరం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అమరావతిని రాష్ట్ర గ్రోత్‌ ఇంజిన్‌గా పరిగణిస్తామని చంద్రబాబు ప్రకటించారు.. దానికి అనుగుణంగా, టీడీపీ ప్రభుత్వం 2014 – 2019 మధ్య కాలంలో దాని అభివృద్ధికి భారీగా ఖర్చు చేసింది. తాజాగా రాజధాని ప్రాజెక్ట్‌ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీని కోసం 2014లో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేయబడింది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కీలకమైన రాజధాని నగరం… 8,603 విస్తీర్ణంలో పెద్ద రాజధాని ప్రాంతం రెండింటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

-నదుల అనుసంధానం…
ఇక ఏపీలో నదుల అనుసంధానం ద్వారా మెరుగైన నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వంశధారను నాగావళి, కృష్ణ్ణ, గోదావరి, పెన్నా నదులతో అనుసంధానం చేసి సాగునీరు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తోంది. తర్వాత పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి కీలకమైన బహుళార్ధసాధక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్లాన్ చేసింది.

-జానాభా నిర్వహణ..
ఏపీలో జనాభా నిర్వహణలో భాగంగా, రాష్ట్రం తగినంత ఉత్పాదక శ్రామిక శక్తిని కలిగి ఉండేలా సంతానోత్పత్తి రేటును పెంచడానికి తగిన ప్రాధాన్యతతో ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి సమతుల్యత వైపుకు వెళుతోంది.

-తర్వాతి ఫోకస్‌ పీ–4

ఇక తర్వాత ఫోకస్‌ ఏరియా ’పీ–4’ అంటే పీపుల్‌–పబ్లిక్‌–ప్రైవేట్‌– పార్టనర్‌షిప్‌. వృద్ధి రేటును పెంచడంలో ఇది ఉత్ప్రేరక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. ఇందులోని ప్రధాన లక్ష్యాలు ప్రభుత్వ జోక్యం ద్వారా ఉన్నవారు, లేనివారి మధ్య అంతరాన్ని తగ్గించడం (ఆర్థిక అసమానతలను తగ్గించడం) , పేదలకు సహాయం చేయడానికి ధనికులను ప్రేరేపించడం.. ఉత్పత్తి పెంచడం.. సామర్థ్య నిర్మాణం , పరిశ్రమలు , వ్యాపారాలను హ్యాండ్‌హోల్డింగ్‌ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ చాలా బలంగా ఉన్న రంగాలలో ఉపాధి కల్పిస్తారు.

-పరిశ్రమలు, పర్యాటకం

పరిశ్రమలు, పర్యాటకం, సేవల రంగాలను ప్రోత్సహించడం అనేది నాణ్యమైన ఉత్పాదకతను సాధించడమే లక్ష్యంగా ఉన్న మరొక ఫోకస్‌ ప్రాంతం. లక్ష్యాలలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని అందించడం, ముఖ్యంగా తయారీ పరిశ్రమలు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం, యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చడం చేస్తారు.

-ఇండస్ట్రీయల్‌ పార్కులు..

పారిశ్రామిక ఉద్యానవనాలలో అత్యుత్తమ అంతర్గత మౌలిక సదుపాయాలను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ –ఎలక్ట్రానిక్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఆటోమొబైల్, పునరుత్పాదక శక్తి, టెలికమ్యూనికేషన్స్, కెమికల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సబ్‌సెక్టార్‌లకు ప్రాధాన్యతనిస్తూ కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తారు.. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండలో కొత్త పారిశ్రామిక క్లస్టర్ల అభివృద్ధికి చర్యలు చేపడుతారు.

-ఇంకా ఈ రంగాలలో..

ప్రభుత్వం పునరుత్పాదక శక్తిని, ప్రత్యేకించి విపరీతమైన పరిధిని కలిగి ఉన్న సౌరశక్తిని వినియోగించుకోవడం, విద్యుత్‌ చలనశీలత సామర్థ్యాన్ని గ్రహించడం లక్ష్యంగా పెట్టుకుంది. విజన్‌–2047, అన్నా క్యాంటీన్లు , సముద్రం , విమానాశ్రయాల అభివృద్ధి, రహదారి మౌలిక సదుపాయాలు కల్పించి ఏపీని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తారు.