Chiranjeevi: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో తమన్నా(Tamannaah Bhatia), విజయ్ వర్మ(Vijay Varma) బ్రేకప్ గురించి ఎన్నో కథనాలు ప్రచారం లోకి రావడం మనమంతా చూసాము. కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని అనుకున్న వీళ్లిద్దరు కొన్ని అనుకోని కారణాల వల్ల బ్రేకప్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు బ్రేకప్ చేసుకున్నారు అనేది ఎవరికీ స్పష్టమైన క్లారిటీ లేదు కానీ, ఎవరికి తోచిన కథలు వాళ్ళు అల్లుకున్నారు. తమన్నా కి ఈ పెళ్లి ఇష్టమేనని, కానీ విజయ్ వర్మ డేటింగ్ వరకు ఓకే, పెళ్ళికి సిద్ధంగా లేనని చెప్పడంతో అతనితో తమన్నా బ్రేకప్ చేసుకుందని వార్తలు వినిపించాయి. ఈ ప్రచారం జరిగిన కొన్నాళ్ళకు ఇప్పుడు మరో ప్రచారం జరుగుతుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ని కూడా కలపడం గమనార్హం. చిరంజీవి(Megastar Chiranjeevi) కి తమన్నా కి మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయనతో కలిసి ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసింది.
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
పూర్తి వివరాల్లోకి వెళ్తే రిపబ్లిక్ వరల్డ్ కథనం ప్రకారం ఈ ఏడాది తమన్నా, విజయ్ లు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. పెళ్లి కి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో తండ్రి తమన్నా తో చర్చించే ప్రయత్నం చేయగా, ఆమె అయిష్టం చూపించినట్టు తెలుస్తుంది. విజయ్ తన మైండ్ సెట్ కి తగ్గట్టు లేడని, అతని ఒత్తిడి కారణంగానే నేను మీడియా కి బయట అతనితో జంతగా కనిపించాల్సి వచ్చిందని తన తండ్రి వద్ద ఈ విషయాన్ని చెప్పుకొని బాధపడిందట. మరి జనాలకు ఈ బ్రేకప్ విషయం గురించి ఎలా చెప్పాలని అనుకుంటున్నావు అని అమ్మానాన్నలు అడగగా, వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని తమన్నా చెప్పిందట. అయితే విజయ్, తమన్నా మ్యాటర్ చిరంజీవి కి ఎప్పటి నుండో తెలుసు. ‘భోళా శంకర్’ మూవీ షూటింగ్ సమయంలో విజయ్ ఎన్నో సార్లు సెట్స్ కి వచ్చిన సందర్భాలు ఉన్నాయట. విజయ్ తో బ్రేకప్ అనే విషయం తెలుసుకున్న తర్వాత చిరంజీవి ఆమెకు బ్రేకప్ గల కారణం జనాలకు వివరించడం బెటర్ అని సలహా ఇచ్చాడట.
నేషనల్ మీడియా లో ఈ వార్త ప్రచారం అవ్వడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె ‘ఓదెల 2′(Odela 2 Movie) మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతుంది. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కాబోతుంది. లాక్ డౌన్ సమయంలో ఆహా మీడియాలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గ బిజినెస్ కూడా జరిగింది. తమన్నా కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కగా, ఆ బడ్జెట్ ని మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే రికవర్ చేసింది ఈ చిత్రం. థియేట్రికల్ బిజినెస్ కూడా హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయింది.