Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). వశిష్ఠ(Director Vasistha) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయిపోయాయి. కేవలం కొంత ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉంది. గ్రాఫిక్స్ విషయం లో ప్రత్యేక శ్రద్ద తీసుకొని మరోసారి రీ వర్క్ చేయించగా, వాటికి మెగాస్టార్ చిరంజీవి ఆమోదం కూడా దొరికింది. దీంతో ఈ చిత్రాన్ని జులై నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు హనుమాన్ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ‘రామ రామ’ ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. శంకర్ మహదేవన్(Shankar Mahadevan) అద్భుతమైన గాత్రంతో, కీరవాణి అందించిన ఈ ట్యూన్ కి ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read : విశ్వంభర సినిమాలో త్రిష కు పోటీగా మరో స్టార్ హీరోయిన్
శోభి మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. పాటలో మంచి డివోషన్ ఉంది, వినేందుకు ఎంతో అద్భుతంగా ట్యూన్ ఉంది, కానీ మెగాస్టార్ రేంజ్ డ్యాన్స్ స్టెప్పులు మాత్రం లేవని అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ లుక్స్ మాత్రం అదిరిపోయాయని అంటున్నారు. ఇంద్ర మూవీ సమయంలో చిరంజీవి ఎలా అయితే ఉండేవాడో, అదే లుక్స్ తో ఈ పాటలో కనిపించాడు. టీజర్ ని చూసి సినిమాని చాలా తక్కువ అంచనా వేసాము కానీ, సినిమాలో బలమైన విషయం ఉందని ఈ పాట ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. శ్రీ రాముడి పై ఇప్పటి వరకు ఎన్నో వేల పాటలు వచ్చాయి, ఈ పాట కూడా వాటికి దగ్గర పోలికలతో ఉంటుందేమో అని అనుకున్నారు కానీ, చాలా ఫ్రెష్ మ్యూజిక్ కి వింటున్న భావన కలిగించారు మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి. ఇక రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది.
ముఖ్యంగా ఈ పాటలో ‘తమ్ముడికి రాజ్యమిచ్చి అడవికేగినాడు..అన్నయ్యంటే ఇతడే’ అంటూ వచ్చే బిట్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. ఈ బిట్ ని కట్ చేసుకొని చిరంజీవి గతంలో ‘ప్రజారాజ్యమే జనసేన గా రూపాంతరం చెందింది’ అంటూ చెప్పిన డైలాగ్ ని మిక్స్ చేసి ఎడిటింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదే పాటలో చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపించబోతున్నాడు. లిరికల్ వీడియో సాంగ్ లో కనిపించలేదు కానీ, మెయిన్ వీడియో సాంగ్ లో ఆయన కచ్చితంగా ఉంటాడు. ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిష కృష్ణన్ నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తుంది. అదే విధంగా ఈ సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటుల గురించి ఎలాంటి సమాచారం రాలేదు. ముఖ్యంగా ఇందులో విలన్ గా ఎవరు చేస్తున్నారు అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ పాట నుండే వరుసగా అప్డేట్స్ వస్తాయని, త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు మేకర్స్.
Also Read : లీకైన ‘విశ్వంభర’ మూవీ పూర్తి స్టోరీ..ఇదే కథ నిజమైతే మెగాస్టార్ అభిమానుల పరిస్థితి ఏంటో!
