Homeఎంటర్టైన్మెంట్OG 2 Thaman Controversy: పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' నుండి తమన్ అవుట్..?...

OG 2 Thaman Controversy: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ నుండి తమన్ అవుట్..? కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

OG 2 Thaman Controversy: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులకు ఒక లైఫ్ టైం మెమరీ లాగా నిల్చిపోయిన చిత్రం ‘ఓజీ'(They Call Him OG). ఈ సినిమాని నేటి తరం ‘జెన్ జీ’ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసి, పవన్ కళ్యాణ్ ని వేరే లెవెల్ లో చూపించడం లో డైరెక్టర్ సుజిత్ ఎంత కష్టపడ్డాడో, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అంతే కష్టపడ్డాడు. ‘ఓజీ’ అనే సినిమా గుర్తుకు వస్తే, మన అందరికీ తమన్ మ్యూజిక్ ముందుగా మైండ్ లో స్ట్రైక్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టి పనిచేశాడు. ఆయన అందించిన మ్యూజిక్ ట్రాక్స్, OST ట్రాక్స్ వేరే లెవెల్. ఇన్ స్టాగ్రామ్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, ఎక్కడ చూసినా నేడు ఓజీ OST ట్రాక్ మాత్రమే వినిపిస్తోంది. ప్రతీ ఒక్కరు ఎడిటింగ్స్ లో కూడా ఈ సినిమాకు సంబంధించిన OST ట్రాక్ ని వాడుకుంటున్నారు.

ఆ రేంజ్ మ్యూజిక్ ని అందించాడు తమన్. ఆయన లేని ఓజీ ని ఊహించుకోవడం అంటే కష్టమే. కానీ వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ‘ఓజీ 2’ కి తమన్ పనిచేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే సుజిత్ త్వరలో నాని తో చేయబోతున్న చిత్రానికి తమన్ సంగీతం అందించడం లేదట. ఆయన స్థానం లోకి ‘ధురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్ వత్ సచ్దేవ్ వచ్చాడట. ‘ధురంధర్’ చిత్రానికి ఆయన అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉందనే చెప్పాలి. నేటి తరం ఆడియన్స్ ఆ మ్యూజిక్ ని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ లో కొత్తదనం కూడా కనిపించింది. అందుకే సుజిత్ తన సినిమాకు అతన్ని తీసుకున్నాడని, ఈ చిత్రం తర్వాత ఆయన చేయబోయే ‘ఓజీ 2’ కి కూడా ఆయనే పనిచేస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

అయితే తమన్ లో ఏమి తక్కువ అయ్యిందని సుజిత్ అతన్ని పక్కన పెట్టాడు అనేదే ఇప్పుడు సోషల్ మీడియా లో నడుస్తున్న చర్చ. ‘ఓజీ’ మూవీ సమయంలో వీళ్లిద్దరు అన్నదమ్ములు లాగానే ఉండేవారు. ఒకరి గురించి ఒకరు చాలా గొప్పగా మాట్లాడుకునేవారు. కానీ ఈమధ్య వీళ్లకు ఏమైనా చెందిందా?, ఈగో క్లాష్ లు ఏమైనా వచ్చాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఓజీ సినిమాకు తమన్ బ్యాక్ బోన్ లాంటోడు. కేవలం ఆయన మాత్రమే ఆ సినిమా లోని సోల్ ని అర్థం చేసుకొని, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టగలడు. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ‘ఓజీ 2’ నుండి తప్పిస్తున్నారు అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కలవర పెడుతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version