https://oktelugu.com/

Vishwambhara: విశ్వంభర సినిమాలో త్రిష కు పోటీగా మరో స్టార్ హీరోయిన్

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి చివరిగా భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు.

Written By: , Updated On : March 20, 2025 / 08:58 PM IST
Vishwambhara

Vishwambhara

Follow us on

Vishwambhara: భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర (Vishwambhara) సినిమా మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా షూటింగ్ చాలా జెట్ స్పీడ్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ జానర్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు మళ్లీడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాగా యు వి క్రియేషన్స్ పతాకంపై వి వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రం రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర సినిమా మెగాస్టార్ చిరంజీవి మరియు కీరవాణి కాంబినేషన్లో రాబోతున్న నాలుగవ సినిమా. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చోటా కె నాయుడు హ్యాండిల్ చేస్తున్నారు. అలాగే ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలోని యాక్షన్స్ సన్నివేశాలను రామ్ లక్ష్మణ్ బృందం రూపొందిస్తుంది. 2024లో సంక్రాంతి సందర్భంగా ఒక కాన్సెప్ట్ వీడియోతో విశ్వంభర అనే టైటిల్ సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఈ వీడియోలో ఒక శక్తివంతమైన వస్తువు విశ్వంలో ప్రయాణించి ఆ తర్వాత భూమిపైకి చేరుకోవడాన్ని చూపించారు. దీన్నిబట్టి ఈ సినిమా మైథలాజికల్ మరియు ఫాంటసీ అంశాలతో ఉన్న కథతో తెరకెక్క పోతుంది అని తెలుస్తుంది.

Aslo Read: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో బుల్లిరాజు..రెమ్యూనరేషన్ ఎంతంటే!

మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రూల్స్ లో కనిపించే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్గా ఈ సినిమాలో త్రిష కృష్ణన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలలో మీనాక్షి చౌదరి, సురభి, హర్షవర్ధన్ వంటి నటులు కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 23, 2023లో హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభమైంది. అయితే ఈ సినిమా కోసం 13 విభిన్న సెట్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Aslo Read: తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తి..? ఇన్ స్టాగ్రామ్ లో ‘అన్ ఫాలో

ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్ మరియు వి ఎఫ్ ఎక్స్ పనుల కారణంగా పోస్టు ప్రొడక్షన్ కు కొంత ఆలస్యం అవుతుందని సమాచారం. ముందుగా సినిమా యూనిట్ జనవరి 10, 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ తేదీని ప్రకటించింది. కానీ వీ ఎఫ్ ఎక్స్ పనుల కారణంగా ఆగస్టు 2025 తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. కేవలం గ్రాఫిక్స్ మరియు వి ఎఫ్ ఎక్స్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాలో నయనతార నటించడం లేదని సమాచారం.