Annamalai : తమిళనాడులో పిక్చర్ క్లారిటీ వచ్చింది. అన్నాడీఎంకే బీజేపీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీచేయబోతున్నాయి. బీజేపీకి కొత్త సారథి వస్తున్నాడు. నయినార్ నాగేంద్రన్ ను బీజేపీ తమిళ అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికయ్యారు. అన్నామలై బీజేపీ సారథిగా తొలగిపోయారు. అన్నామలై పాత్ర ఏంటో తమిళ రాజకీయాల్లో తేలడం లేదు.
ఒక్క అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే 32 శాతం ఓట్లు ఉన్నాయి. మిగతా పక్షాలతో కలిస్తే 40 శాతానికి పైగా ఎన్డీఏకు ఓట్లు ఉన్నాయి. అడ్వంటేజ్ ఎన్డీఏ అర్థమెటిక్ పరంగా ఉన్నాయి.
రాజకీయ ముఖ చిత్రం చూస్తే హీరో జోసఫ్ విజయ్ తో కలిస్తే ముక్కోణపు పోటీ.. సీమెన్ ను కలుపుకుంటే చతుర్ముఖ పోటీ అవతుంది.ఇందులో 40 శాతం ఓటు బ్యాంక్ చూసుకుంటే డిఫినెంట్ గా ఎన్డీఏకు ఇది అడ్వంటేజ్ గా మారుతుంది. కాగితం మీద ఇది బాగానే ఉంది. గ్రౌండ్ లెవల్ లో చూస్తే 2+2 కాదు.. ఆరు, ఏడు కావచ్చు. ఇదంతా కూడా ఫీల్డ్ లెవల్ లో ఉండే కెమిస్ట్రీ ని బట్టి.. ఎన్నికల్లో ఎదురయ్యే నారేటివ్ ను బట్టి ఉంటుంది.
సమస్య ఏంటంటే.. అన్నామలై రోల్ ఏంటో క్లారిటీ లేదు. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి చూస్తే.. ఈపీఎస్ కోసం అన్నామలైను తీసేస్తారా? అన్నది బీజేపీ కేడర్ లో బలంగా ఉంది. అయితే ఇండియా కూటమిని బలహీన పరచాలంటే ఖచ్చితంగా అన్నాడీఎంకేను చీల్చి ఎన్డీఏలో చేర్చుకోవాలన్నది బీజేపీ ఆలోచన..బీజేపీ నిర్ణయం మంచిదేనా? తమిళనాట బీజేపీకి తీరని నష్టం..
అన్నామలై అవుట్ అన్నాడీఎంకే ఇన్.. తమిళ బీజేపీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
