World Best Airports: ప్రపంచంలో వివిధ కేటగిరీలలో దేశాలకు పలు సంస్థలు ర్యాంకులు ఇస్తున్నాయి. నేరాలు, ప్రశాంతత, పర్యాటకం, పాపులేషన్, ఫుడ్, సంపన, పేదరికం.. ఇలా పలు అంశాల్లో ర్యాంకులు ఇస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోని విమానాశ్రయాలకు కూడా ర్యాంకులు ఇస్తున్నారు. 2024–25 సంవత్సరానికి ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల జాబితా విడుదలైంది.
Also Read: భారత తయారీ రంగానికి ‘ట్రంప్’ బూస్ట్…
ప్రపంచ వ్యాప్తంగా దేశాలకు వివిధ అంశాల్లో పలు స్వచ్ఛందం సంస్థలు ర్యాంకులు ఇస్తున్నాయి. డబ్బు ఆధారంగా ధనిక, పేద, పర్యాటకుల ఆధారంగా టూరిజం, సంతోషం ఆధారంగా ప్రశాంతత ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇస్తాయి. అలాగే విమానాశ్రయాల(Air ports)కు కూడా ర్యాంకులు ఇస్తున్నాయి. స్కైట్రాక్స్ ప్రకటించిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్(Changi airport) ప్రపంచంలోనే ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది. రికార్డు స్థాయిలో 13వ సారి ఈ గౌరవాన్ని సాధించిన చాంగి, జ్యువెల్ కాంప్లెక్స్, ఇండోర్ జలపాతం, ఆకర్షణీయ గార్డెన్లతో ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది రెండో, మూడో స్థానాల్లో దోహాలోని హమద్, టోక్యోలోని హనేడా విమానాశ్రయాలు నిలిచాయి. ఇండియా(India), దక్షిణాసియాలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ (Delhi Air port)ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది.
చాంగి ఎయిర్పోర్ట్ ఒక అద్భుత అనుభవం
2024లో 8 కోట్ల మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చిన చాంగి ఎయిర్పోర్ట్, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడిన విమానాశ్రయంగా పేరొందింది. దీని జ్యువెల్ షాపింగ్ కాంప్లెక్స్ 10 అంతస్తులతో, బటర్‌ఫ్లై పార్క్, ఇండోర్ గార్డెన్లు(Indoor Gardens), జలపాతాలతో(Water falls) సందర్శకులను ఆకర్షిస్తోంది. ఎయిర్పోర్ట్ ఆవరణలో స్పాలు, హోటళ్లు, కళా ప్రదర్శనలు, మ్యూజియం(Mugiam), సినిమా థియేటర్, అమ్యూజ్‌మెంట్ పార్కులు ప్రయాణీకులకు వినోదాన్ని అందిస్తున్నాయి.
ప్రపంచ విమానాశ్రయాల ర్యాంకింగ్స్
హమద్ ఎయిర్పోర్ట్, దోహా: గతంలో మూడుసార్లు ఉత్తమ విమానాశ్రయంగా నిలిచిన హమద్(Hamad), ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణీకులకు సౌలభ్యం కల్పిస్తోంది.
హనేడా ఎయిర్పోర్ట్, టోక్యో: ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయంగా గుర్తింపు పొందిన హనేడా(Haneda), ఉత్తమ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, పీఆర్‌ఎమ్ – యాక్సెసబుల్ సౌకర్యాల్లోనూ అగ్రస్థానంలో నిలిచింది.
భారత విమానాశ్రయాల ఘనత
ప్రపంచ టాప్ 20 విమానాశ్రయాల జాబితాలో భారత విమానాశ్రయాలు చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ, దేశీయంగా, దక్షిణాసియా స్థాయిలో భారత విమానాశ్రయాలు రాణిస్తున్నాయి.
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం: ఇండియా, దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయంగా గుర్తింపు సాధించింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం: ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సర్వీస్ అవార్డును అందుకుంది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం: ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా అవార్డు గెలుచుకుంది.
మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, గోవా: 5 మిలియన్ల కంటే తక్కువ ప్రయాణీకుల విభాగంలో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచింది.
2025లో ప్రపంచ టాప్ 20 విమానాశ్రయాలు
సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్
హమద్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, దోహా
టోక్యో హనేడా ఎయిర్పోర్ట్
ఇంచియాన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, దక్షిణ కొరియా
నరిటా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, జపాన్
హాంగ్ కాంగ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
పారిస్ చార్లెస్ డి గాల్ ఎయిర్పోర్ట్
రోమ్ ఫియుమిసినో ఎయిర్పోర్ట్
మ్యూనిచ్ ఎయిర్పోర్ట్
జ్యూరిచ్ ఎయిర్పోర్ట్
దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
హెల్సింకీ–వాంటావా ఎయిర్పోర్ట్
వాంకోవర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్
వియన్నా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్
మెల్బోర్న్ ఎయిర్పోర్ట్
చుబు సెంట్రైర్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, జపాన్
కోపెన్‌హాగన్ ఎయిర్పోర్ట్
ఆమ్‌స్టర్‌డామ్ షిపోల్ ఎయిర్పోర్ట్
బహ్రయిన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్