Vishwambhara First Look : కులం, మతం, దైవం, సంస్కృతి, ఆచారాలు సున్నితమైన అంశాలు. వీటి విషయంలో ఫిల్మ్ మేకర్స్ జాగ్రత్తగా ఉండాలి. మతవిశ్వాసాలు దెబ్బతీసేలా సన్నివేశాలు, డైలాగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆదిపురుష్ మూవీ ఇందుకు గొప్ప ఉదాహరణ. మోడ్రన్ రామాయణ పేరుతో దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ తీవ్ర విమర్శల పాలైంది. ఈ చిత్రంలోని అనేక అంశాలు రామాయణ గాథకు వ్యతిరేకంగా, కించపరిచేలా ఉన్నాయని హిందూ సంఘాలు గగ్గోలు పెట్టాయి.
రావణుడు గెటప్, ఆయన తన వాహనానికి మాంసం ఆహారంగా పెట్టడాన్ని తప్పుబట్టారు. అలాగే లంకలో హనుమంతుడు చెప్పే వల్గర్ డైలాగ్స్ వివాదాస్పదం అయ్యాయి. చెప్పాలంటే ఆదిపురుష్ మూవీలో చాలా తప్పులు ఉన్నాయి. వెరసి ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు ఓం రౌత్ తో పాటు ప్రభాస్ విమర్శలు ఎదుర్కొన్నాడు. గతంలో కూడా మతవిశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్న సినిమాలపై వ్యతిరేకత వ్యక్తమైంది.
తాజాగా ఇదే తరహా వివాదంలో విశ్వంభర మూవీ చిక్కుకుంది. నేడు చిరంజీవి జన్మదినం కాగా విశ్వంభర చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిరంజీవి చేతిలో త్రిశూలం పట్టుకుని ఉన్నాడు. ఇంటెన్స్ సీరియస్ లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే హిందూ వర్గాలు ఈ పోస్టర్ పై మండిపడుతున్నాయి. చిరంజీవి కాళ్లకు షూస్ ధరించి త్రిశూలం చేతబట్టడాన్ని వారు తప్పుబడుతున్నారు. పాదరక్షలు ధరించి పవిత్రమైన త్రిశూలాన్ని పట్టుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఇది పెద్ద వివాదంగా మారింది. త్రిశూలం పరమశివుడు చేతిలో ఉండే ఆయుధం. దీనికి ఒక పవిత్రత, ప్రాశస్త్యం ఉంది. హిందువుల మనోభావాలను విశ్వంభర పోస్టర్ దెబ్బతీసేలా ఉందనేది తాజా వాదన. మరి దీనికి దర్శకుడు ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. కాగా విశ్వంభర 2025 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకుడు. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
When darkness and evil take over the world, a shall shine bright to fight
Happy birthday, MEGASTAR @KChiruTweets ❤️
Let the world witness your aura with #Vishwambhara ✨
Get ready for a MEGA MASS BEYOND UNIVERSE, In cinemas from January 10th,… pic.twitter.com/8pqHaIeRIe
— UV Creations (@UV_Creations) August 22, 2024