https://oktelugu.com/

Chiranjeevi Birthday: నీలాంటి మిత్రుడు దొరకడం నా అదృష్టం అంటూ అక్కినేని నాగార్జున చిరంజీవి పై ఎమోషనల్ ట్వీట్స్!

చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. మీరు కోట్లాది మంది అభిమానులకు మాత్రమే కాదు, నీ తోటి హీరోలైన మాలాంటి వారికి కూడా ఎంతో ఆదర్శప్రాయులు. మీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం' అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 22, 2024 / 06:01 PM IST

    Chiranjeevi Birthday

    Follow us on

    Chiranjeevi Birthday: నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా లో సెలెబ్రిటీల నుండి శుభాకాంక్షలు వెల్లువ కురుస్తుంది. నేటి తరం స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ప్రత్యేకంగా చిరంజీవి ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తన తరం హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్, చిరంజీవి తో తాను రీసెంట్ గా కలిసి దిగిన ఫోటోని అప్లోడ్ చేసి శుభాకాంక్షలు తెలియచేసాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కి ఇండస్ట్రీ లో అత్యంత ఆప్తుడు ఎవరైనా ఉన్నారంటే, అది అక్కినేని నాగార్జున మాత్రమే. ఒకే తల్లి కడుపులో పుట్టకపోయిన కూడా వీళ్లిద్దరు అన్నదమ్ములు లాగానే ఉంటారు. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నాగార్జున శుభాకాంక్షలు తెలియచేసిన తీరు మెగా అభిమానులు హృదయాలు సంతోషంతో నిండిపోయేలా చేసింది.

    ఆయన మాట్లాడుతూ ‘ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. మీరు కోట్లాది మంది అభిమానులకు మాత్రమే కాదు, నీ తోటి హీరోలైన మాలాంటి వారికి కూడా ఎంతో ఆదర్శప్రాయులు. మీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం’ అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. నాగార్జున చిరంజీవి గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చిన ఇంతే ప్రేమతో మాట్లాడుతాడు. బిగ్ బాస్ ఎపిసోడ్ కి ఒకరోజు రామ్ చరణ్ వచ్చినప్పుడు, రామ్ చరణ్ సంస్కారం గురించి కంటెస్టెంట్స్ పొగుడుతుంటే, నాగార్జున అది మా అన్నయ్య నేర్పించిన సంస్కారం అంటూ మాట్లాడిన మాటల్ని అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. చిరంజీవి – నాగార్జున కి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతటి పోటీ వాతావరణం లో కూడా వీళ్లిద్దరి మధ్య ఇంత స్నేహపూర్వక వాతావరణం ఎలా సాధ్యం అని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్న విషయం.

    ఈ ఇద్దరు హీరోలను చూసి నేటి తరం హీరోలు కూడా ఇదే విధంగా ఆప్యాయతతో మెలగాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటి తరం హీరోలు కూడా అలాగే ఉన్నారు కానీ, కొంతమంది హీరోల మధ్య మాత్రం ఇప్పటికీ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. వాళ్ళు కూడా మారిపోతే బాగుంటుందని కోరుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ షూటింగ్ లో బిజీ గా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుభేర’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ధనుష్ కూడా మరో హీరోగా నటిస్తుండగా, రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నాగార్జున కి ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రంతో మంచి హిట్ దొరికింది. ఇప్పుడే అదే విజయపరంపర ని ‘కుభేర’ చిత్రం తో కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.