https://oktelugu.com/

Viagra : ఈ ఫుడ్స్ తింటే.. వయాగ్రా వాడాల్సిన పనిలేదు

ఎక్కువ సేపు శృంగారం చేయాలంటే వయాగ్రా వాడక్కర్లేదు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వాటికంటే ఫవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. సహజంగా లభించే కొన్ని ఆహార పదార్థాలే వయాగ్రాలా పనిచేస్తాయి. వయాగ్రా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండేలా కూడా ఈ ఆహారపదార్ధాలు చేస్తాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 22, 2024 / 05:46 PM IST

    Viagra

    Follow us on

    Viagra :  ప్రతిఒక్కరి జీవితంలో శృంగారం అనేది ముఖ్యమైనది. అయితే కొంతమంది దీనిని ఎక్కువ సేపు చేయడానికి కొన్ని రకాల మందులు వాడుతుంటారు. అందులో ఒకటి వయాగ్రా. కొందరు పురుషులు వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అయితే వీటిని వాడటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ సేపు శృంగారం చేయాలంటే వయాగ్రా వాడక్కర్లేదు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వాటికంటే ఫవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. సహజంగా లభించే కొన్ని ఆహార పదార్థాలే వయాగ్రాలా పనిచేస్తాయి. వయాగ్రా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా మీరు ఆరోగ్యంగా ఉండేలా కూడా ఈ ఆహారపదార్ధాలు చేస్తాయి. ఇంతకీ ఆ ఆహార పదార్థాలేంటో మరి తెలుసుకుందామా.

    డార్క్ చాక్లెట్
    డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయితే ఇందులో ఉండే సెరోటోనిన్, ఫెనెథైలమైన్ లైంగికంగా సాయపడుతుంది. కాబట్టి రోజూ ఒక డార్క్ చాక్లెట్ తింటే మీకు ఎలాంటి వయాగ్రా అవసరంలేదు.

    అవకాడో
    ఆరోగ్యానికి మేలు చేసే అవకాడో పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను పెంచడంలో ఉపయోగపడుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో సాయపడుతుంది. వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడైనా వీటికి తినడం బెటర్.

    అరటిపండ్లు
    ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తప్రసరణను ప్రేరేపిస్తాయి. అలాగే టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి ఈ పండ్లు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల బరువు పెరగడంతో పాటు యనర్జిటిక్‌గా కూడా ఉంటారు.

    దానిమ్మ
    దానిమ్మ పండు రోజూ తినడం వల్ల రక్తం ఉత్పత్తి అవుతుంది. అలాగే సహజ వయాగ్రాలా పనిచేస్తుంది. రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే చర్మం కూడా గ్లోగా తయారువుతుంది.

    బచ్చలికూర
    బచ్చలికూరను రోజూ తినడం వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయి. అాగే టెస్టోస్టెరాన్ స్థాయిలను కూడా పెంచుతాయి.

    కొబ్బరి నీరు
    ఈ నీరు వల్ల తక్షణమే శక్తి వస్తుంది. కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్స్‌లా పనిచేస్తుంది. అలాగే లైంగికంగా ఇబ్బంది లేకుండా చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున కొబ్బరి నీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారు.

    వెల్లుల్లి
    వెల్లుల్లిని డైట్‌లో యాడ్ చేసుకుంటే లైంగిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. కూరల్లో లేదా డైరెక్ట్‌గా వెల్లుల్లిని తిన్నా ఆరోగ్యానికి మంచిదే.

    గుమ్మడి గింజలు
    గుమ్మడి గింజల్లో ఉండే జింక్, ఒమేగా 3 ఆమ్లాలు లైంగిక హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. వీటిని తినడం వల్ల బలంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు.

    మునగకాయలు
    లైంగిక కోరికలకు మునగకాయలు బాగా పనిచేస్తాయి. వీటిని కూర వండుకుని కనీసం వారానికొకసారి తింటే ఫలితం మీరే చూస్తారు.

    పుచ్చకాయలు
    ఇందులో ఉండే సిట్రిక్లైన్ అమైనో ఆమ్లం లైంగిక కోరికలను బాగా ఉత్తేజ పరుస్తుంది.