https://oktelugu.com/

తుఫాన్ లో ఇరుక్కుపోయి.. ఎంజాయ్ చేస్తున్నాడు !

ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాండిచ్చేరిని కూడా నివర్ తుపాను వణికిస్తోంది అని చెప్పడం చిన్నమాట అవుతుందేమో.. మరి 200 కిలోమీటర్ల దూరంలో తుపానుగా బలపడిందంటేనే పాండిచ్చేరి ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ తుఫాన్ లో ఓ తెలుగు హీరో ఇరుక్కుపోయి తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు, “ఫలక్ నమా దాస్” లాంటి సూపర్ హిట్ తో యూత్ లో […]

Written By:
  • admin
  • , Updated On : November 25, 2020 / 04:48 PM IST
    Follow us on


    ప్రస్తుతం తమిళనాడుతో పాటు పాండిచ్చేరిని కూడా నివర్ తుపాను వణికిస్తోంది అని చెప్పడం చిన్నమాట అవుతుందేమో.. మరి 200 కిలోమీటర్ల దూరంలో తుపానుగా బలపడిందంటేనే పాండిచ్చేరి ప్రస్తుత పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు కూడా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ తుఫాన్ లో ఓ తెలుగు హీరో ఇరుక్కుపోయి తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు, “ఫలక్ నమా దాస్” లాంటి సూపర్ హిట్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరో విశ్వక్ సేన్. ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాగల్ అనే సినిమా ఒకటి చేస్తున్నాడు.

    Also Read: టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకునే డైరెక్టర్లు ఎవరంటే?

    కాగా “పాగల్” సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజుల కిందట విశ్వక్ సేన్ పాండిచ్చేరి వెళ్లాడు. అక్కడ కొన్ని రోజుల పాటు షూటింగ్ బాగానే సాగినా.. ఆ తరువాత నుండి టార్చర్ మొదలైందట. మొదట వర్షాలుగా ప్రారంభం అయి, ఆ తరువాత తుపానుగా మారిపోవడంతో పాగల్ టీమ్ నానా ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. దాంతో చేసేదేం లేక ఇక షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. కానీ నిన్న విశ్వక్ సేన్ అనుకోకుండా బయటకు వెళ్లడం.. దాంతో వర్షం కారణంగా నిన్న అంతా ఓ చోట ఉండిపోవాల్సి రావడంతో విశ్వక్ సేన్ ఒక్కడే అయిపోయాడు. దీనికితోడు ఈ రోజు తుపాను కూడా ఎక్కువైంది.

    Also Read: ‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా?

    అలా మొత్తానికి తుపాను ప్రభావంతో హీరో విశ్వక్ సేన్ పాండిచ్చేరిలో ఇరుక్కుపోయాడు. అయినా తానూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడట. తుపాను వల్ల షూటింగ్ ఆగిపోయిందనే బాధ తనకు లేదట. పైగా తనకు మళ్ళీ ఫ్రీ టైమ్ దొరికిందని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడట. అందులో భాగంగా పాండీ వీధుల్లో నడుస్తూ, ఐస్ క్రీమ్ తింటూ ఫోటోలు దిగుతూ.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మొత్తానికి నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్