https://oktelugu.com/

ఆశ ఎక్కువైంది.. అసలుకే మోసం వచ్చింది !

రష్మికా మండన్న.. అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిన యంగ్ బ్యూటీ. దీనికితోడు ఈ బ్యూటీకి యూత్ లో మాం..చి ఇది.. అంటే “నేషనల్ క్రష్” అన్నమాట. ఇటీవలే గూగుల్ ఆన్ లైన్ ట్రెండ్స్ సర్వేలో తేలిందంటంటే జాతీయస్థాయిలో కుర్రకారు రష్మిక అంటే తమకి “క్రష్” అని బాహాటంగానే చెప్పారట. అందుకే కాబోలు ఆ యూత్ ను మరింతగా ఆకట్టుకుని భారీ సంఖ్యలో అభిమానులను పొందేందుకు ఈ యువ భామ తన హద్దులు చేరిపేసుకుని […]

Written By:
  • admin
  • , Updated On : November 25, 2020 / 04:25 PM IST
    Follow us on


    రష్మికా మండన్న.. అదృష్టం కలిసొచ్చి స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయిన యంగ్ బ్యూటీ. దీనికితోడు ఈ బ్యూటీకి యూత్ లో మాం..చి ఇది.. అంటే “నేషనల్ క్రష్” అన్నమాట. ఇటీవలే గూగుల్ ఆన్ లైన్ ట్రెండ్స్ సర్వేలో తేలిందంటంటే జాతీయస్థాయిలో కుర్రకారు రష్మిక అంటే తమకి “క్రష్” అని బాహాటంగానే చెప్పారట. అందుకే కాబోలు ఆ యూత్ ను మరింతగా ఆకట్టుకుని భారీ సంఖ్యలో అభిమానులను పొందేందుకు ఈ యువ భామ తన హద్దులు చేరిపేసుకుని రోజురోజుకు గ్లామర్ డోస్ ను పెంచుకుంటూ.. తనలోని దాగిన అందచందాలను ఎప్పటికప్పుడు కొత్తగా చూపిస్తూ అలా ముందుకు సాగిపోతూ ఉంది.

    Also Read: ‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా?

    ఈ క్రమంలో లేటెస్ట్ గా చేస్తోన్న ఫోటోషూట్ లలో బాగా స్టయిల్ తో పాటు కాస్త హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోతుంది. నిజానికి ఈ మధ్య ఫోటోల్లో కొంత స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లకు కనువిందు కలిగిస్తోంది రష్మిక. అందాల ప్రదర్శనకు ఎలాగూ మొహమాటం లేదు కాబట్టి.. ఈ భామకు అవకాశాలు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. అలా వచ్చిందే తమిళ్ స్టార్ సూర్య సినిమా. దాంతో అమ్మడు రెమ్యునరేషన్ ను భారీ స్థాయిలో పెంచేసిందట. పైగా కండీషన్లు కూడా రోజురోజుకూ పెరిగిపోతూ ఉన్నాయట. అసలు రష్మికను తీసుకుందే బడ్జెట్ తగ్గించుకుందామని, అలాంటిది లీడింగ్ స్టార్ హీరోయిన్ తీసుకుంటే అయ్యే బడ్జెట్ కంటే.. రష్మికను తీసుకోవడం వల్ల ఎక్కువ బడ్జెట్ అవుతుందని ‘సూర్య సినిమా’ మేకర్స్ మొత్తానికి ఈ బ్యూటీని తమ సినిమా నుండి తెలివిగా సాగనంపారు.

    Also Read: టాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకునే డైరెక్టర్లు ఎవరంటే?

    అయితే డైరెక్ గా ఆమె పేరు మెన్షన్ చెయ్యకుండా… “ఆ ప్రచారాన్ని నమ్మొద్దు. మా సినిమాలో నటించే నటీనటుల, సాంకేతిక నిపుణల వివరాలు మేమే ప్రకటిస్తాం. అప్పటివరకు ఈ వార్తలను నమ్మొద్దు,” అంటూ సూర్య సినిమా దర్శకుడు పాండురాజు ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దాంతో రష్మిక, సూర్య సరసన కన్ఫర్మ్ అయిందనేది ఊహాగానానికి ఫైనల్ గా ఫుల్ స్టాఫ్ పడింది. పాండురాజు ట్వీట్ ని బట్టి చూస్తే… ఇక ఈ సినిమాలో రష్మిక మళ్ళీ రావడం డౌటే. పాపం రష్మిక.. ఆశ ఎక్కువైతే అసలుకే మోసం వచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్