https://oktelugu.com/

హీరోయిన్లు మాల్దీవులకు.. హీరోలు దుబాయ్ కి.. !

కరోనా ప్రవాహంతో టూర్ లకు వెళ్లే హీరోహీరోయిన్లు నెలలు తరపడి ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దాంతో ప్రస్తుతం అందరూ చాల గ్యాప్ తరువాత తమకు ఇష్టమైన ప్లేస్ లకు వెళ్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రకుల్, తాప్సి, మెహ్రీన్, ప్రణీత, శాన్వి, కాజల్, సమంత.. ఇలా చాలామంది హీరోయిన్లు ఎక్కువుగా మాల్దీవులకు క్యూ కడుతుంటే.. హీరోలు మాత్రం ఛలో దుబాయ్ అంటూ అక్కడకి వెళ్లి ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా […]

Written By:
  • admin
  • , Updated On : November 25, 2020 / 04:58 PM IST
    Follow us on


    కరోనా ప్రవాహంతో టూర్ లకు వెళ్లే హీరోహీరోయిన్లు నెలలు తరపడి ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దాంతో ప్రస్తుతం అందరూ చాల గ్యాప్ తరువాత తమకు ఇష్టమైన ప్లేస్ లకు వెళ్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రకుల్, తాప్సి, మెహ్రీన్, ప్రణీత, శాన్వి, కాజల్, సమంత.. ఇలా చాలామంది హీరోయిన్లు ఎక్కువుగా మాల్దీవులకు క్యూ కడుతుంటే.. హీరోలు మాత్రం ఛలో దుబాయ్ అంటూ అక్కడకి వెళ్లి ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలు కూడా ఫ్యామిలీతో దుబాయ్ కు వెళ్లి హ్యాపీగా ఫ్యామిలీతో విలువైన సమయాన్ని గడిపారు. ముందుగా మహేష్ దుబాయ్ వెళ్లొచ్చాడు. కుటుంబసమేతంగా దుబాయ్ వెళ్లిన సూపర్ స్టార్, కొన్ని రోజుల పాటు అక్కడ ఫుల్ రిలాక్స్ అయ్యాడట.

    Also Read: ఆశ ఎక్కువైంది.. అసలుకే మోసం వచ్చింది !

    మహేష్ వెళ్లి వచ్చాక.. తన స్నేహితులు అయినా తోటి స్టార్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ కు కూడా అక్కడ బాగుందని, కుదిరితే మీరు కూడా ఫ్యామిలీతో వెళ్లి రండి అంటూ మహేష్ మొత్తానికి వారికీ కూడా దుబాయ్ వెళ్లాలనే ఆలోచనను రేకెత్తించాడు. దాంతో ఎన్టీఆర్ కూడా తన ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లాడు. కుటుంబంతో పాటు దుబాయ్ వెళ్లి.. అక్కడి వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశాడట ఎన్టీఆర్. మరి తారక్ దుబాయ్ సంగతి నితిన్ కి చెప్పాడో లేదో గానీ, ఇప్పుడీ లిస్ట్ లోకి నితిన్ కూడా చేరిపోయాడు. లాక్ డౌన్ కారణంగా పెళ్లి తర్వాత హనీమూన్ కు కూడా వెళ్లలేదు నితిన్. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు పరిమితమైపోయాడు.

    Also Read: పాపం కీర్తి సురేష్ ను వదిలేలా లేరు !

    ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం నితిన్ కు కాస్త టైమ్ దొరికింది. దీంతో తన భార్యను తీసుకొని.. మహేష్ ఎన్టీఆర్ లు వెళ్లిన దుబాయ్ కే వెళ్లాడు. అక్కడి లొకేషన్స్ కి థ్రిల్ అయిన నితిన్ ఏకంగా తానూ చేస్తున్న ఓ సినిమా షూటింగ్ ను దుబాయ్ లోనే ప్లాన్ చేశాడు. కాగా ఆ షూటింగ్ పూర్తయిన తర్వాత.. భార్యతో కొన్ని రోజులు దుబాయ్ లోనే ఉండి వస్తాడట. మరి ఈ హీరోలకు దుబాయ్ లో అంతగా నచ్చిన స్పాట్ లు ఏమిటి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ స్పాట్ లు ఏమిటో హీరోలే చెప్పాలి. ఇక దుబాయ్ వెళ్లే లిస్ట్ లో రవితేజ, నాని, సుశాంత్ కూడా ఉన్నారట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్