విశ్వక్ సేన్ కొత్త చిత్రం ప్రారంభం

‘ఫలక్ నుమా దాస్’ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్. ‘HIT’ మూవీతో ఘనవిజయం సాధించాడు. HIT మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ 5వ మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది. లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ రూపొందనుంది. చిత్ర […]

Written By: admin, Updated On : March 19, 2020 5:41 pm
Follow us on

‘ఫలక్ నుమా దాస్’ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వక్ సేన్. ‘HIT’ మూవీతో ఘనవిజయం సాధించాడు. HIT మూవీ లో ఇన్ స్పెక్టర్ విక్రమ్ రుద్రరాజు క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఈ రోజు విశ్వక్ సేన్ 5వ మూవీ పూజా కార్యక్రమం జరుపుకుంది.

లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా #VS5 మూవీ రూపొందనుంది. చిత్ర యూనిట్ ఈ మూవీ టైటిల్ లోగో ను రిలీజ్ చేసింది. ‘పాగల్’ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ కి ‘అర్జున్ రెడ్డి’ మూవీ ఫేమ్ రధాన్ సంగీతం అందించనున్నారు. సూపర్ హిట్ ‘హుషారు’మూవీ నిర్మాత బెక్కం వేణుగోపాల్ ‘పాగల్ ‘ మూవీ ని నిర్మిస్తున్నారు.