Vishwak Sen: ప్రస్తుతం కుర్ర హీరోల్లో మార్కెట్ మొత్తాన్ని కోల్పోయే పరిస్థితి లో ఉన్న హీరో విశ్వక్ సేన్(Vishwak Sen). ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తో మినిమం గ్యారేజీ హీరో అని అనిపించుకున్న విశ్వక్ సేన్, ఈమధ్య కాలం లో మెకానిక్ రాకీ, లైలా , ఫంకీ వంటి మూడు భారీ డిజాస్టర్ ఫ్లాప్స్ తో మార్కెట్ లో తనకున్న ఇమేజ్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఆ ఇమేజ్ ని తిరిగి సంపాదించుకోవడం కోసం కెరీర్ ప్రారంభం లో ఎలాంటి కసితో పని చేశాడో, ఇప్పుడు కూడా అదే కసితో పని చెయ్యాలి. అలా ఆయన ఎంతో కసితో చేసిన చిత్రం ‘కల్ట్'(#Cult Movie). ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడమే కాదు, దర్శకత్వం కూడా వచించాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలు అందించాడు.
నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లోని లార్జ్ స్క్రీన్ లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఒక లేడీ రిపోర్టర్ తో గొడవ పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. అంతకంటే ముందు విశ్వక్ సేన్ అభిమానులను ఉద్దేశించి ఈ చిత్రం కోసం మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభం లో ఎదో సాధించాలి అనే కసి,కోపం ఉండేది. ఆ కసితోనే ఈ చిత్రాన్ని చేశాను. చాలా మంది నేను సోషల్ మీడియా అనుసరించడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ సోషల్ మీడియా లో కామెంట్స్ అన్ని చదివి, మీరు ఎలాంటి సినిమా అయితే కావాలని కోరుకుంటున్నారో, అలాంటి కథని ఎంచుకొని, అన్నీ కలిపి మిక్సింగ్ చేసి ఈ చిత్రాన్ని తీశాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండండి. చిన్న పిల్లలని కూడా తీసుకొని రాకండి, బలహీనమైన గుండె ఉన్నోళ్లు అసలు ఈ చిత్రానికి రాకండి’ అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం ఆయన ఈ సినిమా సంగీత దర్శకుడు రవి బస్రూర్ కి గోల్డ్ రోలెక్స్ వాచ్ ని బహూకరించి, ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ ఒక కన్ను అయితే, మరో కన్ను రవి బస్రూర్ అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతాడు. అనంతరం రవి బస్రూర్ కూడా విశ్వక్ గురించి చాలా గొప్పగా మాట్లాడుతాడు. నా పాతికేళ్ల సినీ కెరీర్ లో అందరూ నాతో గొప్పగా పని చేయించుకున్నారు కానీ, నాలోని సోల్ ని చూసి అర్థం చేసుకున్నది మాత్రం విశ్వక్ సేన్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు రవి బస్రూర్. ఇంకా వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.