Homeఎంటర్టైన్మెంట్Ram Pothineni: మనసు మార్చుకున్న రామ్ పోతినేని..క్రేజీ డైరెక్టర్ తో తదుపరి సినిమా ఖరారు!

Ram Pothineni: మనసు మార్చుకున్న రామ్ పోతినేని..క్రేజీ డైరెక్టర్ తో తదుపరి సినిమా ఖరారు!

Ram Pothineni: స్టార్ హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా కెపాసిటీ ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల మీడియం రేంజ్ హీరో గానే ఉండిపోయాడు. ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఉన్న ఆ మీడియం రేంజ్ మార్కెట్ కూడా నాశనం అయ్యింది. ఇప్పుడు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు 20 కోట్ల రూపాయలకు జరిగితే చాలా ఎక్కువ అనుకోవచ్చు. అది కూడా […]

Ram Pothineni: స్టార్ హీరో అయ్యేందుకు అన్ని విధాలుగా కెపాసిటీ ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). కానీ సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల మీడియం రేంజ్ హీరో గానే ఉండిపోయాడు. ఇప్పుడు వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఉన్న ఆ మీడియం రేంజ్ మార్కెట్ కూడా నాశనం అయ్యింది. ఇప్పుడు ఆయన సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు 20 కోట్ల రూపాయలకు జరిగితే చాలా ఎక్కువ అనుకోవచ్చు. అది కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే భయం బయ్యర్స్ లో పుట్టే రేంజ్ లో రామ్ మార్కెట్ పడిపోయింది. అర్జెంటు గా ఇప్పుడు ఆయనకు ఒక హిట్ కావాలి. అందుకోసం ఇతరులను నమ్మకూడదని, స్వయంగా తన సొంతం గా కథ రాసుకొని వెళ్లడం బెటర్ అని ముందుగా అనుకున్నాడట రామ్. అందుకోసం ఆయన సుదీర్ఘ విరామం కూడా తీసుకున్నాడు.

మరికొంతమంది అయితే, రామ్ ఒక హారర్ చిత్రం చేస్తున్నాడు, బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది అనే వార్త కూడా ప్రచారం చేశారు. ఈ రెండు ప్రయత్నాలు రామ్ చేసిన విషయం వాస్తవమే, కానీ చివరికి ఆయన తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆయన తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వం లో చేయబోతున్నట్టు సమాచారం. గతం లో కూడా రామ్ ఇలా వరుస ఫ్లాప్స్ లో ఉన్నప్పుడు కిశోరె తిరుమల ఆయనకు ‘నేను శైలజ’ వంటి క్లాసిక్ చిత్రాన్ని అందించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వడమే కాకుండా , రామ్ కెరీర్ లోనే మంచి ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి రామ్ కెరీర్ రిస్క్ లో పడింది. అలాంటి సమయం లో ఆయన కిషోర్ తిరుమల తో సినిమా చేయబోతున్నాడు. కచ్చితంగా ఈసారి కూడా కం బ్యాక్ ఇస్తాడని బలమైన నమ్మకం తో ఉన్నారు రామ్ ఫ్యాన్స్.

కిషోర్ తిరుమల రీసెంట్ గానే మాస్ మహారాజ రవితేజ తో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి ‘ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా బాగా ఆడకపోయి ఉండొచ్చు కానీ, కంటెంట్ పరంగా మాత్రం క్రిటిక్స్ నుండి మంచి మార్కులు కొట్టేసింది. కాబట్టి కిషోర్ తిరుమల లో ఇంకా సత్తా ఉంది, ఆయన మంచి సినిమాలు తీయగలడు అనే నమ్మకం రామ్ ఫ్యాన్స్ లో కూడా ఉంది. చూడాలి మరి ఈ సినిమా రామ్ కెరీర్ కి ఎంత ఉపయోగపడుతుంది అనేది. వచ్చే నెల ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన జరుగుతుందట. ఇక ఈ చిత్రం లో నటించబోయే నటీనటుల వివరాలు, టెక్నీషియన్స్ వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper