https://oktelugu.com/

Ashokavanamlo Arjuna Kalyanam: ట్రైలర్ టాక్: అర్జున క‌ళ్యాణంలో మలుపుల మయం !

Ashokavanamlo Arjuna Kalyanam: యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటేస్ట్ చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 06:48 PM IST
    Follow us on

    Ashokavanamlo Arjuna Kalyanam: యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటేస్ట్ చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. కాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ పెళ్లి నేపథ్య కథతో బాపినీడు – సుధీర్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. లేటు వయసులో పెళ్లి చేసుకోబోతున్న హీరో.. ఆ పెళ్లి అవుతుందా లేదా అనే టెన్షన్‌ లో పడే పాట్లు.. ఇలా సాగుతుంది ఈ సినిమా. ఈ సినిమాతో, విద్యాసాగర్ చింత దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

    Ashokavanamlo Arjuna Kalyanam

    ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నాయికగా రుక్సార్ థిల్లాన్ నటించింది. ఈ సినిమాను మే 6న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ సరదాగా మొదలై.. చివర్లో ఎమోషనల్ గా ఎండ్ అయింది. మొత్తానికి ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.

    Also Read: NTR Movie Cancelled: ఎన్టీఆర్ కొత్త సినిమా క్యాన్సిల్ అయ్యిందా?? ఆందోళనలో ఫాన్స్

    పెళ్ళికొడుకుగా విశ్వక్ సేన్.. అమ్మాయికి అబ్బాయి ఇష్టం లేదని పెళ్ళి ఆగిపోవడం, దాంతో అర్జున్ కుమార్ ఫ్యామిలీకి, అమ్మాయి ఫ్యామిలీకి మధ్య గొడవ ప్రారంభమవ్వడం ఇలా అనేక మలుపులతో ఈ ట్రైలర్ సాగింది. ఎమోషన్స్ తో, పంచ్ డైలాగులతో వచ్చిన ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచింది.

    Ashokavanamlo Arjuna Kalyanam

    ఇక ‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం కాబట్టి.. ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా పైనే తన హోప్స్ అన్నీ పెట్టుకున్నాడు విశ్వక్‌ సేన్‌. మరి విశ్వక్‌ సేన్‌ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? సినిమాలో మ్యాటర్ మాత్రం చాలామందికి కనెక్ట్ అయ్యేలా ఉంది.

    ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

    Also Read:Taapsee Pannu: తాప్సీ క్లారిటీ ఇచ్చింది.. కానీ ఉపయోగం ఏముంది ?

     

     

     

    Recommended Videos:

    Tags