Megastar Chiranjeevi: చిరంజీవి మెసేజ్ పై చంద్రబాబు ఫ్యాన్స్ సీరియస్ !

Megastar Chiranjeevi: నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ‘బాబు’కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషంగా ఆకట్టుకుంది. ఇంతకీ చిరు చంద్రబాబుకు ఏ విధంగా పుట్టినరోజు విషెస్ చెప్పారు ? అంటూ నెటిజన్లు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరి మెగాస్టార్ ఎలా చెప్పారో మనం కూడా ఒక లుక్కేద్దాం. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ […]

Written By: Shiva, Updated On : April 21, 2022 10:28 am
Follow us on

Megastar Chiranjeevi: నారా చంద్రబాబు నాయుడు 72వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ‘బాబు’కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం విశేషంగా ఆకట్టుకుంది. ఇంతకీ చిరు చంద్రబాబుకు ఏ విధంగా పుట్టినరోజు విషెస్ చెప్పారు ? అంటూ నెటిజన్లు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. మరి మెగాస్టార్ ఎలా చెప్పారో మనం కూడా ఒక లుక్కేద్దాం.

Megastar Chiranjeevi

చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ చిరు మెసేజ్ చేశాడు. అయితే, ఈ ట్వీట్‌ పై టీడీపీ అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Also Read: Ashokavanamlo Arjuna Kalyanam: ట్రైలర్ టాక్: అర్జున క‌ళ్యాణంలో మలుపుల మయం !

చిరంజీవి చాలా తెలివిగా ట్వీట్ పెట్టాడు అని, అసలు బాబు గారి అనుభవం గురించి గానీ, ఆయన రాజకీయ విశేషాల గురించి గానీ.. అలాగే బాబు ఘనమైన ఘనతల గురించి గానీ.. చిరంజీవి ఎక్కడా ప్రస్తావించలేదు అని.. ఇది తమను, తమ నాయకుడిని అవమానించడమే అని నారా అభిమానులు ఫీల్ అవుతున్నారు.

అసలు బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారే తక్కువ ఉన్నార్రా అంటే.. మళ్లీ ఇలాంటి పిచ్చి కండిషన్స్ ఒకటి. కనీసం, మెగాస్టార్ మనసు అయినా మంచిది కాబట్టి.. ఇలా విషెస్ తెలిపారు. కానీ, మిగిలిన హీరోలు అయితే.. కనీసం సింగిల్ మెసేజ్ కూడా చేయలేదు. ప్రస్తుతం జగన్ ప్రభంజనం నడుస్తోంది కాబట్టి.. బాబు ప్రభ మసకబారింది

Megastar Chiranjeevi

ఏది ఏమైనా మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ గా మారింది. అన్నట్టు చిరంజీవి.. తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా వచ్చే వారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read:Hero Surya:పేదలకు ఉచితంగా ఇల్లులు కట్టించిన హీరో సూర్య

Recommended Videos:

Tags