Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే, కాజల్‌కు కొడుక్కి ఏ పేరు పెట్టబోతున్నారనే ప్రస్తుతం వార్త వైరల్ అవుతుంది. తాజాగా కాజల్ చెల్లి ‘నిషా అగర్వాల్’ బాబు పేరును రివీల్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. ఇంతకీ కాజల్ కుమారుడి పేరు ఏమిటో తెలుసా ? ‘నీల్ కిచ్లు’.

తనకు బాబు పుడితే.. ‘నీల్ కిచ్లు’ అని పెట్టాలని కాజల్ ముందే డిసైడ్ అయ్యింది. ఆ ప్రకారమే బాబుకు ఈ పేరు పెట్టారు. ఇక కాజల్ దంపతులకు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుంది, అందాల తార అయినా, అచ్చతెలుగు ఇల్లాలు అయినా అమ్మతనానికి అందరూ అభిమానులే.
Also Read: NTR Movie Cancelled: ఎన్టీఆర్ కొత్త సినిమా క్యాన్సిల్ అయ్యిందా?? ఆందోళనలో ఫాన్స్
అంత గొప్పది తల్లిప్రేమ. అందుకే, తల్లి తనాన్ని ఏ సర్వేతో కొలవలేం, ఏ పదాలతో పోల్చలేం. దేశానికీ రాజు అయినా, తల్లికి బిడ్డే అన్నారు. ఆ బిడ్డ విషయంలో తల్లి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉంది చందమామ కాజల్ అగర్వాల్. నిజానికి ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ సుఖ ప్రసవం కోసం ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంది.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వేళ ఎలాంటి ఎక్సర్ సైజ్ లు చేయాలో వాటిని తూచా తప్పకుండా చేసింది. పైగా ఓ ప్రత్యేక ట్రైనర్ సమక్షంలో ఈ కసరత్తులు చేసింది. ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. కాజల్ లకు సుఖ ప్రసవం జరిగింది. మొత్తానికి తల్లిగా కాజల్ అగర్వాల్ మళ్ళీ వార్తల్లో నిలిచింది. మరి మాతృమూర్తిగా మారిన ఈ అందాల చందమామకు ప్రత్యేక శుభాకాంక్షలు.
పనిలో పనిగా ఇక తాను ఏమి చేసినా తన బిడ్డ కోసమే అంటూ కాజల్ కాస్త ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా కాజల్ అభిమానులు ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read:Taapsee Pannu: తాప్సీ క్లారిటీ ఇచ్చింది.. కానీ ఉపయోగం ఏముంది ?
Recommended Videos:



[…] Anjali: అంజలి మంచి నటి అని ఇండస్ట్రీలో పాజిటివ్ టాక్ ఉంది. పైగా చాలా సినిమాల్లో తన నటనతో బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చేస్తోన్న ‘శంకర్ – చరణ్’ సినిమాలో కూడా అంజలి నటన అద్భుతంగా ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తమిళ దర్శకుడు బాల అంజలి నటన చూసి.. తమిళంలో తెరకెక్కుతున్న ‘ఆనందం విలయదుం వీడు 2’ అనే సినిమాలో ఆమెనే హీరోయిన్ గా రికమండ్ చేశాడు. . […]
[…] Megastar Chiranjeevi: ఇప్పుడంటే స్టార్ హీరోలు ఏడాదిక ఒక సినిమా చేస్తేనే ఎక్కువ. కానీ 1990వ దశకంలో మాత్రం చిరంజీవి, కృష్ణ లాంటి స్టార్ హీరోలు ఒకే ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు చేసేవారు. అందులో చాలా వరకు హిట్టు అయ్యాయి కూడా. అప్పట్లో చిరంజీవి మెగాస్టార్‌గా ఫుల్ ఫామ్ లో వరుసబెట్టి సినిమాలు చేశారు. కాగా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు ఇప్పటికీ ఆయన పేరు మీదనే ఉన్నాయి. వాటిని కొట్టడం కూడా కష్టమే. అలాంటి ఓ అరుదైన రికార్డు గురించి ఇప్పుడు చెప్పుకుందాం. […]