Vishvambhara : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర'(Viswambhara Movie). వశిష్ఠ(Vasistha Malladi) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మొదట్లో అంచనాలు భారీగానే ఉండేవి కానీ, ఇప్పుడు మాత్రం ఆ స్థాయి అంచనాలు లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కారణం టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్. ఈ గ్రాఫిక్స్ మొత్తం సినిమాలో లేవని, అది కేవలం టీజర్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన గ్రాఫిక్స్ మాత్రమేనని డైరెక్టర్ వశిష్ఠ తండ్రి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమా నుండి హనుమాన్ జయంతి సందర్భంగా ‘రామ రామ’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ నుండి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకు శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు.
Also Read : ‘విశ్వంభర’ మొదటి పాట విడుదల తేదీని ప్రకటించిన మూవీ టీం!
అదే విధంగా శంకర్ మహదేవన్ గాత్రం అందించాడు. MM కీరవాణి అందించిన బీట్ పై అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి గా లేరు. అయితే ఈ పాట చిత్రీకరణ కోసం నిర్మాత దాదాపుగా ఆరు కోట్ల రూపాయిల ఖర్చు చేశాడట. కేవలం ఈ ఒక్క పాట కోసం ప్రత్యేకమైన సెట్స్ ని ఏర్పాటు చేశారట. డ్యాన్సర్స్ కూడా వందల సంఖ్యలో ఉంటారని తెలుస్తుంది. లిరికల్ వీడియో సాంగ్ లో విజువల్స్ ని చూస్తుంటే భారీ గానే ఉన్నాయి. మేకర్స్ పెట్టిన ఖర్చు కళ్ళకు కనిపిస్తుంది కానీ, ఫ్యాన్స్, ఆడియన్స్ కి ఈ వీడియో సాంగ్ నచ్చుతుందా లేదా అనేది చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని జులై 24న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కేవలం ఒక్క పాట చిత్రీకరణ మినహా, షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయట.
ఈ నెలలోనే మెగాస్టార్ చిరంజీవి తో సహా, నటీనటులందరూ డబ్బింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. టీజర్ లో గ్రాఫిక్స్ ని చూసి సినిమాలో కూడా అలాగే ఉంటుందని అభిమానులు పొరబడకండి. సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా వచ్చాయి, త్వరలో కొత్త టీజర్ ని విడుదల చేయబోతున్నాము, మీకే ఒక క్లారిటీ వస్తుంది అని డైరెక్టర్ వశిష్ఠ తండ్రి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ ఇంకా సేల్ అవ్వలేదు. అందుకే మేకర్స్ ఇంకా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. నెట్ ఫ్లిక్స్ సంస్థకే డిజిటల్ రైట్స్ దాదాపుగా ఖరారు అయిపోయి ఉంటుందని అంటున్నారు మేకర్స్. మేకర్స్ అడిగినంత డబ్బులు ఇవ్వడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పుకోలేదు కానీ, ఒక డీసెంట్ స్థాయి రేట్ కి అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది.
Also Read : ‘విశ్వంభర’ చిత్రం నుండి మొదటి పాట ‘రామ రామ’ ప్రోమో వచ్చేసింది..!