https://oktelugu.com/

Vishnupriya: బిగ్ బాస్ హౌస్లో నేను కంట్రోల్ తప్పాను, పీరియడ్స్ టైంలో అలా అయ్యింది.. విష్ణుప్రియ ఓపెన్ కామెంట్స్

బిగ్ బాస్ సీజన్ 8లో విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. ఆశించిన స్థాయిలో రాణించలేదు. కనీసం ఆమె ఫైనల్ కి కూడా వెళ్ళలేదు. హౌస్ నుండి బయటకు వచ్చాక విష్ణుప్రియ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె కీలక కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో తాను కంట్రోల్ తప్పానంటు ఓపెన్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : December 26, 2024 / 08:29 AM IST

    Vishnupriya

    Follow us on

    Vishnupriya: ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. కన్నడ నటుడు నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గౌతమ్ రన్నర్. ఇక నబీల్, ప్రేరణ, అవినాష్ తర్వాత స్థానాల్లో నిలిచారు. కాగా విష్ణుప్రియ టైటిల్ విన్నర్ అవుతుందని అందరు భావించారు. కానీ ఆమె ఫైనల్ కి కూడా వెళ్లలేకపోయింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 14 మంది సెలెబ్స్ ని బిగ్ బాస్ హౌస్లోకి పంపారు. వారిలో విష్ణుప్రియకు భారీ ఫేమ్ ఉంది. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ టైటిల్ అమ్మాయిదే అనుకున్నారు.

    విష్ణుప్రియ గేమ్ ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఆమె పృథ్విరాజ్ వ్యామోహంలో పడటం ఆడియన్స్ కి నచ్చలేదు. ఏ దశలో కూడా విష్ణుప్రియ తన మార్క్ చూపలేకపోయింది. పృథ్వికి సేవలు చేస్తూ, అతడితో రొమాన్స్ చేస్తూ నెట్టుకొచ్చింది. ఆమె గేమ్ కి పది వారాలు హౌస్లో ఉండటమే ఎక్కువ. నీ గేమ్ తప్పుదారి పట్టిందని హెచ్చరించినా విష్ణుప్రియ మార్చుకోలేదు. విష్ణుప్రియపై నెగిటివిటీ పెరిగింది. 14వ వారం ఆమె ఎలిమినేట్ అయ్యారు.

    బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక విష్ణుప్రియ మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మేరకు కీలక కామెంట్స్ చేశారు. తన గేమ్ చూసి కొందరు సపోర్ట్ చేశారు. కొందరు విమర్శిచారని ఆమె అన్నారు. నాకు సీజన్ 3 నుండి బిగ్ బాస్ ఆఫర్ వస్తుంది. కానీ నేను వెళ్ళలేదు. కోటి రూపాయలు ఇచ్చినా బిగ్ బాస్ షోకి వెళ్ళను, అని గతంలో నేను చేసిన కామెంట్స్ ఆధారంగా ట్రోల్ చేశారు. కొందరు ఎపిసోడ్స్ చూడకుండానే విమర్శలు చేశారని, ఆమె అన్నారు.

    నేను నాలాగే హౌస్లో ఉన్నాను. మా గురువు గారు సలహా మేరకే నేను బిగ్ బాస్ షోకి వెళ్ళాను. ఈ మధ్య నాకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. నన్ను నేను ఎంత వరకు కంట్రోల్ చేసుకోగలనో తెలుగుకోవాలని వెళ్ళాను. కొన్ని సందర్భాల్లో నేను కంట్రోల్ తప్పాను. పీరియడ్స్ టైం హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వలన కూడా నేను సరిగా ఆడలేదని, విష్ణుప్రియ చెప్పుకొచ్చింది కాగా ఈ సీజన్ కి విష్ణుప్రియ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. వారానికి రూ. 4 లక్షలు చొప్పున 14 వారాలకు రూ. 56 లక్షలు రెమ్యూనరేషన్ గా రాబట్టిందట.